Vijay Deverakonda: ఇండియా పాక్ మ్యాచ్‌లో తళుక్కుమన్న లైగర్.. రౌడీ రేంజే వేరబ్బా..!!

మ్యాచ్‌లందు ఇండియా-పాక్‌ మ్యాచే వేరు. ఆట మాత్రమే కాదు.. అంతకుమించిన ఎమోషన్. 10 నెలల గ్యాప్ తర్వాత రెండు జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం పై క్రీడాభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Vijay Deverakonda: ఇండియా పాక్ మ్యాచ్‌లో తళుక్కుమన్న లైగర్.. రౌడీ రేంజే వేరబ్బా..!!
Vijay Deverakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2022 | 8:01 PM

మ్యాచ్‌లందు ఇండియా-పాక్‌ మ్యాచే వేరు. ఆట మాత్రమే కాదు.. అంతకుమించిన ఎమోషన్. 10 నెలల గ్యాప్ తర్వాత రెండు జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం పై క్రీడాభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2018లో జరిగిన ఆసియాకప్‌ను కొల్లగొట్టింది మనోళ్లే. ఇప్పుడు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది కూడా మనవాళ్లే. గతేడాది టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. అది కూడా ఇదే దుబాయ్‌ గడ్డపై. ఆ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20, వన్డే ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్ చేతిలో టీమిండియాకు తొలి పరాజయం అదే. ఆ ఓటమి భారం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. సో.. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే. అంతకుమించిన రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది రోహిత్‌సేన. ఫామ్ పరంగా టీమ్‌ పరంగా పాక్‌ కంటే టీమిండియానే ఫేవరేట్‌. రోహిత్‌ శర్మ, రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా లాంటి ప్లేయర్లతో బ్యాటింగ్‌ లైనప్‌ ఓ పవర్‌ఫుల్‌గా ఉంది. అందరూ హిట్టర్లే. ఏ ఒక్కరు బ్యాట్ ఝుళిపించినా పాక్‌కి ముచ్చేమటలే. ఇక అందరూ తలో చేయి వేస్తే దబిడిదిబిడే.

ఈ ఇంట్రస్టింగ్ మ్యాచ్ లో ఓ స్టార్ హీరో తళుక్కున మెరిశారు. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్ కు ముందు ఇండియన్ టీమ్ గురించి ఆయన మాట్లాడారు. లైగర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు విజయ్ ఇలా ఇండియా పాక్ మ్యాచ్ లో మెరవడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.\

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి