Chiyaan Vikram’s Cobra Movie : అభిమానుల కోలాహలం మధ్య ‘కోబ్రా’ మీట్ అండ్ గ్రీట్
వర్సటైల్ యాక్టర్ విక్రమ్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విక్రమ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ను మెప్పించారు.
వర్సటైల్ యాక్టర్ విక్రమ్(Chiyaan Vikram) సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విక్రమ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ను మెప్పించారు. హీరోయిజం మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సరికొత్త సాహాసాలు చేసేందుకు ముందుంటాడు విక్రమ్. తెలుగులోనూ ఆయన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. ఇక ఇప్పుడు కోబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
కోబ్రా సినిమాను ఎట్టకేలకు ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో విక్రమ్ రకరకాల గెటప్స్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు టీమ్. ఇటీవలే కోబ్రా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆంచనాలను పెంచితే.. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. అలాగే కోబ్రా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కోబ్రా మూవీ ప్రెస్ మీట్ ను ఇక్కడ లైవ్ చూడండి.