Tollywood: డాడీ సినిమాలో నటించిన ఈ బాలనటి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు పక్కా స్టన్ అవుతారు
డాడీ సినిమాలో నటించిన బాలనటి ప్రేక్షకుల మనషుల్లో చెరిగిపోని ముద్ర వేసింది. చిన్నతనంలోనే ఎంతో ముద్దుగా ఉన్న ఆ బాలిక.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో మీరు కూడా చూస్తారా..?
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ ‘డాడీ’ మూవీ(Daddy Movie) ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఆ సినిమాలోని సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్. అందులో గుమ్మాడి.. గుమ్మాడి పాట అయితే ఎవర్‌గ్రీన్. ఆ చిత్రంలో చిరంజీవి తనయ పాత్రలో నటించి.. తన ముద్దు ముద్దు మాటలు.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది చైల్డ్ యాక్టరస్ అనుష్కా మల్హోత్రా. అక్షయగా, ఐశ్వర్యగా.. అన్ని ఎమోషన్స్ పండించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించింది. ఆ సినిమాతో ఈ చిన్నారికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ప్రేక్షకులు మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఎందుకో కానీ ‘డాడీ’ మూవీ తర్వాత ఈ బాలనటి సినిమాల్లో యాక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి ఇప్పడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన ప్రజంట్ ఫోటో చూపించి ఈ యువతే.. అప్పుడు బాలనటిగా ‘డాడి ‘మూవీలో నటించింది అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం ముక్కుపుడకలో ఉన్న తన ముఖారవిందం చూస్తే.. ప్రజంట్ కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే. కాగా అనుష్క తన ఫోటోలను ప్రజంట్ సోషల్ మీడియాలో చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి.
View this post on Instagram