Punarnavi: ఆర్ యూ వర్జిన్ ?.. నెటిజన్ ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన బిగ్బాస్ బ్యూటీ.. ఏమన్నదంటే..
ఇక ఇటీవల ఫాలోవర్లతో ముచ్చటించిన పునర్నవి డేటింగ్ విషయంపై స్పందించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తన స్టైల్లో ఆనర్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది పునర్నవి భూపాలం. ఈ షో తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. అయితే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పునర్నవి.. ప్రస్తుతం ఆమె లండన్ లో సైకాలజీ హయ్యర్ స్టడీస్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అంతేకాకుండా అప్పుడు ఇన్ స్టా లైవ్ లోకి వచ్చి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇక ఇటీవల ఫాలోవర్లతో ముచ్చటించిన పునర్నవి డేటింగ్ విషయంపై స్పందించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తన స్టైల్లో ఆనర్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
మీరు ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఎస్ అని తెలిపింది. అలాగే మీరు వర్జిన్ నా ? అని మరో నెటిజన్ అడగ్గా… ఇలాంటి ప్రశ్న వేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. దీంతో పునర్నవి చేసిన ఈ చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతుంది. బిగ్ బాస్ ఇంట్లో ఎంతో రెబల్ గా కనిపించింది పునర్నవి. అయితే ఈ రియాల్టీ షో కంటే ముందు పున్నూ.. ఉయ్యాల జంపాల చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అవికా గోర్ స్నేహితురాలిగా కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎందుకు ఏమో, సైకిల్, చిన్న విరామం వంటి చిత్రాల్లో నటించింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.