Ramya Krishnan: ‘ అప్పటికే స్టార్ హీరోయిన్ను.. కానీ ఆ ధైర్యం చేయలేకపోయాను’.. రమ్యకృష్ణ కామెంట్స్..
ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో అలనాటి అగ్రకథానాయికలలో రమ్యకృష్ణ (Ramya Krishnan) ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన రమ్యకృష్ణ.. ఇప్పుడు తల్లిగా..వదినగా.. అమ్మగా.. సహయనటిగా మెప్పిస్తోంది. ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించారు. రౌడీ హీరో విజయ్ తల్లిగా జీవించేశారు ఆమె. అయితే అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో కాకుండా హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకున్నారు రమ్యకృష్ణ. కానీ బాలీవుడ్లో అంతగా క్లిక్ కాలేకపోయారు. తాజాగా హిందీ సినిమాల గురించి ప్రస్తావించారు రమ్యకృష్ణ. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
” హిందీలో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ నేను చేసిన సినిమాలు సరిగ్గా హిట్ కాలేదు. అలాగే నేను అప్పటికే తెలుగు పెద్ద హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నాను. కాబట్టి ఆ పరిశ్రమను వదిలి పెట్టి హిందీలో సూపర్ హిట్ కోసం పోరాటం చేసేందుకు ధైర్యం చేయలేకపోయాను. అన్నింటినీ వదులుకునే ధైర్యం అప్పట్లో లేదు” అంటూ చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ. ఆమె హిందీలో దయావన్, పరంపర, ఖల్నాయక్, చాహత్, బనారసి బాబు, బడే మియాన్ చోటే మియాన్ వంటి చిత్రాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
“ఒక నిర్ధిష్ట పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేయాలంటే సరైన హిట్ కావాలి. కానీ హిందీలో అలాంటి సూపర్ హిట్ రాలేదు. అదే సమయంలో తెలుగు సినిమాలు చేయడం సౌకర్యంగా అనిపించింది” అని తెలిపారు.