AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్ లుక్ అదిరిపోయిందిగా.. కొర మీసంతో పవర్‏ఫుల్ లుక్‏లో అన్నయ్య..

ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్‏తో సినిమా మరింత అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో చిరు పొలిటికల్ లుక్‏లో కనిపించనున్నారు. 

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్ లుక్ అదిరిపోయిందిగా.. కొర మీసంతో పవర్‏ఫుల్ లుక్‏లో అన్నయ్య..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2022 | 7:05 AM

Share

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పీడ్ పెంచారు. వరుస చిత్రాలతో థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించారు చిరు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో తన తన తదుపరి చిత్రాలపై మరింత శ్రద్ద పెట్టారు మెగాస్టార్. ఇప్పుడు చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ కాగా.. మరోకటి డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న మెగా 154.. అలాగే.. దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్‏తో సినిమా మరింత అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో చిరు పొలిటికల్ లుక్‏లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొర మీసంతో ఊర మాస్ లుక్‏లో అదిరిపోయిన ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చాలా కాలం తర్వాత చిరును అలా మాస్ రఫ్ లుక్‏లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ లుక్‏లో డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న మెగా 154 చిత్రంలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోండగా.. కీలకపాత్రలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు రవితేజ.

Follow Us
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..