Cricket:11 బంతుల్లోనే 34 రన్స్‌.. వరుసగా 4 సిక్స్‌లు.. 19 ఏళ్ల ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ సంచలనం

టెస్ట్‌ క్రికెట్‌.. వన్డే ఫార్మాట్‌.. టీ20.. హండ్రెడ్‌ లీగ్‌.. ఇలా క్రికెట్‌ను ఎప్పటికప్పుడు కొత్త ఫార్మాట్‌లకు మారుస్తూ గతంలో కంటే మరింత ఉత్కంఠభరితంగా, వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ కొత్తగా 60 బంతుల టోర్నమెంట్ ది సిక్స్టీకి శ్రీకారం చుట్టింది.

Cricket:11 బంతుల్లోనే 34 రన్స్‌.. వరుసగా 4 సిక్స్‌లు.. 19 ఏళ్ల ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ సంచలనం
Dewald Brevis
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2022 | 8:06 AM

టెస్ట్‌ క్రికెట్‌.. వన్డే ఫార్మాట్‌.. టీ20.. హండ్రెడ్‌ లీగ్‌.. ఇలా క్రికెట్‌ను ఎప్పటికప్పుడు కొత్త ఫార్మాట్‌లకు మారుస్తూ గతంలో కంటే మరింత ఉత్కంఠభరితంగా, వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ కొత్తగా 60 బంతుల టోర్నమెంట్ ది సిక్స్టీకి శ్రీకారం చుట్టింది. ఈ టోర్నమెంట్ కేవలం కరేబియన్ ప్రీమియర్ లీగ్ జట్ల మధ్య మాత్రమే జరుగుతోంది. అయితే ఫార్మాట్ ఏదైనా చెలరేగే యువ బ్యాటర్లు ఈ టోర్నీలోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన 19 ఏళ్ల డెవాల్డ్ బ్రెవిస్ ది సిక్స్టీ టోర్నీలో సిక్సర్ల వర్షం కురిపించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యవ వహిస్తోన్న అతను జమైకా బౌలర్లను చీల్చి చెండాడాడు. 11 బంతుల్లో ఏకంగా 34 రన్స్‌ చేశాడు. ఇందులో ఏకంగా 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 309 కావడం గమనార్హం.

జట్టును గెలిపించని మెరుపు ఇన్నింగ్స్‌..

ఇవి కూడా చదవండి

అయితే, ఈ ఇన్నింగ్స్ కూడా పేట్రియాట్స్ విజయానికి సహాయపడలేదు. ఎందుకంటే పేట్రియాట్స్ జట్టు మొత్తం కేవలం 84 పరుగులకే ఆలౌటై 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా నిర్ణీత 60 బంతుల్లో 139 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఆల్-రౌండర్ ఫాబియన్ అలెన్ జమైకా తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..