AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NZ: పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ ఆడకుండానే..?

T20 World Cup 2026 Super 8 weather Update: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలోని మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు, పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

PAK vs NZ: పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ ఆడకుండానే..?
Pakistan Cricket
Venkata Chari
|

Updated on: Feb 21, 2026 | 9:39 AM

Share

Pakistan Practice Cancelled Colombo Rain: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశ తొలి మ్యాచ్ పాకిస్థాన్ vs న్యూజిలాండ్ జట్ల మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా కురుస్తున్న వర్షాలు పాక్ జట్టు ప్రిపరేషన్స్‌ను దెబ్బతీశాయి.

మ్యాచ్‌కు 24 గంటల ముందే పాకిస్థాన్ ప్లాన్స్ ఫెయిల్..

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు పాకిస్థాన్ జట్టు చేయాల్సిన ప్రాక్టీస్ సెషన్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో దాదాపు మూడు గంటల పాటు నెట్స్‌లో సాధన చేయాల్సి ఉండగా, భారీ వర్షంతో ఆ అవకాశం దక్కలేదు. మ్యాచ్‌కు ముందు కీలకంగా భావించిన నెట్ ప్రాక్టీస్ లేకపోవడంతో పాకిస్థాన్ జట్టు టెన్షన్‌లో పడింది.

మ్యాచ్‌పైనే ముంచుకొస్తున్న వర్ష ముప్పు..

కొలంబో వాతావరణ సూచనల ప్రకారం, ఫిబ్రవరి 21న భారీ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజంతా మేఘావృతం ఉండొచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సాయంత్రం 7 గంటల సమయంలో 50%కు పైగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య కూడా వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావం మ్యాచ్‌పై పడే అవకాశం ఉంది.

వర్షం కారణంగా ఓవర్లు కుదించే పరిస్థితి తలెత్తవచ్చు. ఒక జట్టు పూర్తి 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి, రెండో జట్టు బ్యాటింగ్ సమయంలో వర్షం వస్తే డక్‌వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం కొత్త లక్ష్యం నిర్ణయిస్తారు. అంపైర్లు మ్యాచ్‌కు ఫలితం వచ్చేలా పూర్తి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సూపర్–8 దశలో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఈ దశకు రిజర్వ్ డే లేదు. పూర్తిగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో ఒక్క పాయింట్ ఇవ్వబడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us