Swara Bhasker: “వాళ్ళు కావాలనే బాలీవుడ్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు”.. సంచలన కామెంట్స్ చేసిన స్వరభాస్కర్

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న మాట బాయ్ కాట్. ఈ ఒక్క మాట బాలీవుడ్ ను బదనాం చేస్తోంది. అక్కడ ఏ సినిమా విడుదలైన బాయ్ కాట్ అంటూ కొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Swara Bhasker: వాళ్ళు కావాలనే బాలీవుడ్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు.. సంచలన కామెంట్స్ చేసిన స్వరభాస్కర్
Swara Bhaskar
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 02, 2022 | 7:04 AM

Swara Bhasker: బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న మాట బాయ్ కాట్. ఈ ఒక్క మాట బాలీవుడ్ ను బదనాం చేస్తోంది. అక్కడ ఏ సినిమా విడుదలైన బాయ్ కాట్ అంటూ కొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. దాంతో సినిమాల పై నేటిగిటివిటీ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో హిందీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాల పరిస్థితికూడా అలానే ఉంది. ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా అంతంతమాత్రమే అనిపించుకుంటున్నాయి దాంతో బాలీవుడ్ ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒక్క భారీ హిట్ పడితే తిరిగి ఫామ్ లోకి రావొచ్చని అక్కడి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సౌత్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలుస్తుండటంతో ఇప్పటికైనా బాలీవుడ్ దర్శక నిర్మాతలు మేలుకోవాలి అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పలువురు సినిమా తారలు కూడా బాలీవుడ్ కు ఈ పరిస్థితిరావడం పై స్పందిస్తున్నారు. తాజాగా నటి స్వరభాస్కర్ స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. బాయ్ కాట్ అనేది సినిమా ల కలెక్షన్స్  పై ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో నాకు తెలియదు అని అన్నారు స్వరా. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి చెందిన సమయంలో కొందరు ఆయన మరణం ను వ్యక్తిగతంగా తీసుకుని తమ ప్రయోజనాల కోసం దీనిని వాడుకునే ప్రయత్నం చేశారు అని చెప్పుకొచ్చింది. అదే సమయంలో అలియా భట్ నటించిన గంగూభాయ్ సినిమా పై కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. అప్పుడు చాలా మంది అలియా భట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు బాయ్ కాట్ డిమాండ్ చేశారు. అయినా కూడా ఆమె నటించిన గంగూ బాయ్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కొందరు కావాలని బాలీవుడ్ ను నాశనం చేయాలని చూస్తున్నారు అని స్వరాభాస్కర్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి