KBC: ‘కేబీసీ’లో కోటి రూపాయల ప్రశ్న.. ఈమె ఓడిపోయింది.. మరి మీరు ఆన్సర్ చెప్పగలరా!
కేబీసీ సీజన్ 14లో కేరళకు చెందిన అనూ వర్గీస్ అనే మహిళ తన అపారమైన తెలివితేటలతో 15 ప్రశ్నలకు సరైన జవాబిచ్చి..
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఈ షో గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతుండగా.. ప్రతీ సీజన్‌లోనూ అద్భుతమైన టీఆర్పీలతో దూసుకుపోతోంది. చదువు తక్కువ ఉన్నా.. లోకజ్ఞానం, రాజకీయ, చారిత్రాత్మక అంశాలపై అవగాహన ఉంటే ఇందులో మనం పాల్గొనవచ్చు. అయితే మనకు ప్రతిభ మాత్రమే కాదు.. అదృష్టం కూడా తోడుంటేనే ఎన్నో అవకాశాలు దక్కుంచుకోగలం. ఈ కోవలోనే తన తెలివితేటలకు.. కాస్త అదృష్టాన్ని జత చేసి.. ఈ షోలో ఓ మహిళ దాదాపు రూ. కోటి వరకు వచ్చి.. చివర్లో జస్ట్ మిస్ అయింది.
కేబీసీ సీజన్ 14లో కేరళకు చెందిన అనూ వర్గీస్ అనే మహిళ తన అపారమైన తెలివితేటలతో 15 ప్రశ్నలకు సరైన జవాబిచ్చి.. రూ. 75 లక్షల గెలుపొందింది. అయితే దురదృష్టవశాత్తు 16వ ప్రశ్నకు తప్పు జవాబిచ్చి తృటిలో రూ. కోటి మిస్ చేసుకుంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..
ప్రశ్న: మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన కొన్ని పోస్టల్ స్టాంపులపై ఏమని రాసి ఉంది?
a) సారే జహాన్ సే అచ్చా, b) రఘుపతి రాఘవ రాజా రామ్, c) జన గణ మన, d) వందేమాతరం
ఈ ప్రశ్నకు ఆమె సరైన జవాబు ఇవ్వలేకపోయింది. దీనితో రూ. 75 లక్షలు గెలుచుకుని ఇంటికెళ్లింది. మరి ఈ కోటి రూపాయల ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా.! తెలిస్తే కామెంట్స్‌లో తెలపండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..