Viral: ఇదేం విచిత్రం! బొజ్జ గణపయ్యకూ ఆధార్ కార్డు ఇచ్చేశారుగా.. నెట్టింట ట్రెండింగ్!

ఆధార్ కార్డు ఇప్పటివరకు జనాలకు ఇవ్వడం మీరు చూసి ఉంటారు.. అయితే ఇప్పుడు మన బొజ్జ గణపయ్యకు కూడా..

Viral: ఇదేం విచిత్రం! బొజ్జ గణపయ్యకూ ఆధార్ కార్డు ఇచ్చేశారుగా.. నెట్టింట ట్రెండింగ్!
Ganesh Aadhaar
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 01, 2022 | 7:49 PM

ఆధార్ కార్డు ఇప్పటివరకు జనాలకు ఇవ్వడం మీరు చూసి ఉంటారు.. అయితే ఇప్పుడు మన బొజ్జ గణపయ్యకు కూడా ఆధార్ కార్డు వచ్చేసింది. అందులో ఆయన వివరాలు చూస్తే మీరూ నోరెళ్లబెడతారంతే! గణేష్ ఉత్సవాలు మొదలైతే చాలు.. గణనాధుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో మనవాళ్ల క్రియేటివిటీ పీక్స్‌కు చేరుతుంది కాబట్టి.. గణపతి విగ్రహాలను సినీ సెలబ్రిటీలు, ప్రముఖల స్టైల్స్‌లో రూపొందిస్తుంటారు. అయితే ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహించే కొందరికి ఓ వినూత్న ఆలోచన తట్టింది. అలా ఆలోచన వచ్చిందో లేదో.. ఇలా గణపతికి ఆధార్ కార్డును సృష్టించేశారు..

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌ రాజధాని జంషెడ్‌పూర్‌లోని ప్రజలు గణేష్ ఉత్సవాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారు ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోంది. అదేంటంటే.. వారంతా కొంచెం కొత్తగా అలోచించి.. మన బొజ్జ గణపయ్యకు ఆధార్ కార్డు నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్‌తో మండపం రూపొందించాక.. జనాలు రాకుండా ఉంటారు. ఒక్కసారిగా పోటెత్తారు. సెల్ఫీలు దిగుతూ.. సందడి చేశారు. బొజ్జ గణపయ్యను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆ ఆధార్ కార్డులో మన గణపయ్య డీటయిల్స్ ఎలా ఉన్నాయంటే..!

ఆధార్ కార్డు ఫోటోలో అడ్రస్ ఇలా.. ‘శ్రీ గ‌ణేశ్ S/o మ‌హాదేవ్‌, టాప్ ఫ్లోర్‌, మాన‌స స‌రోవ‌ర్ స‌ర‌స్సు ద‌గ్గర‌, కైలాస్ ప‌ర్వత్, పిన్‌కోడ్ 000001, డేట్ ఆఫ్‌ బ‌ర్త్ 01/01/600CEగా, నెంబర్ 9678 9959 4584’ రాసి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..