Project K: భారతానికి ప్రభాస్ సినిమాకి లింకేంటి.? అసలు ప్రాజెక్ట్ కే కథేంటి.? ఆసక్తిరేకెత్తిస్తోన్న లేటెస్ట్ అప్‌డేట్..
Project K: ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆది పురుష్' నుంచి మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న 'ప్రాజెక్ట్ కే' వరకు అన్నీ భారీ బడ్జెట్, అంచనాలతో తెరకెక్కుతున్నవే. వీటిలో ప్రాజెక్ట్ కేపై భారీ అంచనాలు ఉన్నాయి...
Project K: ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ‘ఆది పురుష్’ నుంచి మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ వరకు అన్నీ భారీ బడ్జెట్, అంచనాలతో తెరకెక్కుతున్నవే. వీటిలో ప్రాజెక్ట్ కేపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌తో పాటు దీపికా పదుకొణె నటిస్తుండడం విశేషం. దీంతో ఈ సినిమా మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సైతం సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా కథ కథెంటీ అన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. టైమ్ ట్రావెల్ కథ అని ఇప్పటికే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు కథకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితిని పురస్కరించుకొని చిత్ర యూనిట్ విడుదల చేసిన ఓ పోస్ట్ సినిమా కథపై అంచనాలు పెంచేసింది. సినిమా సెట్స్‌లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన చిత్ర యూనిట్ ఓ నోట్‌ను రాసుకొచ్చారు. ఇందులో.. ‘ఒకప్పుడు వేదవ్యాసునికి మహాభారతం రాయడానికి సహాయం చేశావు..ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి విఘ్నేశ్వరా’ అని పేర్కొన్నారు.
దీంతో ప్రాజెక్ట్‌కు భారతానికి సంబంధం ఉందని చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పారా.? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహాభారతంలోని ఒక చాప్టర్ ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ‘కే’ అనే అక్షరానికి అర్థం ఏంటి.? అసలు పురాణ ఇతివృత్తానికి ఈ సినిమాకు సంబంధం ఏంటి.? అన్న విషయాలు తెలిలాయంటే సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..