AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: కేవలం 29 రోజుల్లో షూటింగ్ 512 రోజుల ప్రదర్శన.. చిరు కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ..ఏమిటో తెలుసా

ఉగాది పచ్చడి లాంటి చిరు సినీ జర్నీలో భిన్నమైన క్యారెక్టర్స్ తో అనేక అరుదైన రికార్డ్స్ ను క్రియేట్ చేశారు. భావితరాలకు ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేశారు. మరి ఈరోజు చిరు సృష్టించిన అరుదైన రికార్డ్ గురించి తెలుసుకుందాం.. 

Megastar Chiranjeevi: కేవలం 29 రోజుల్లో షూటింగ్ 512 రోజుల ప్రదర్శన.. చిరు కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ..ఏమిటో తెలుసా
Megastar Chiranjeev I
Surya Kala
|

Updated on: Sep 03, 2022 | 1:35 PM

Share

Megastar Chiranjeevi: ఇంతింతై వటుడింతైనట్లు.. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరు ఎదిగిన తీరు ఆదర్శం. హీరోగా అడుగు పెట్టినా.. కెరీర్ మొదట్లో తనకు లభించిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. స్వయం కృషితో తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు తన అభిమానులను బ్లడ్ బ్రదర్స్ గా భావించడమే కాదు.. వారిని సేవా కార్యక్రమాల వైపు పయనించేలా చేసి.. సరికొత్త అధ్యాయానికి నాందిపలికిన చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో మలుపు.. పాత్ర ఏదైనా సరే..నటించడమే తన వంతు అన్నట్లు భవిమ్చమేకాదు.. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా తన పనిని తాను చేసుకుని పోయే చిరు జీవి చిరంజీవి. ఉగాది పచ్చడి లాంటి చిరు సినీ జర్నీలో భిన్నమైన క్యారెక్టర్స్ తో అనేక అరుదైన రికార్డ్స్ ను క్రియేట్ చేశారు. భావితరాలకు ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేశారు. మరి ఈరోజు చిరు సృష్టించిన అరుదైన రికార్డ్ గురించి తెలుసుకుందాం..

60 వసంతల్లో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు హీరో ల్లో ఒకరుగా ఇలా అనేక పాత్రల్లో నటించారు. ఖైదీ సినిమాతో ఓ రేంజ్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు.  మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అనేక రికార్డ్స్ క్రియేట్ చేసినా ఓ సినిమా వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే ఆ సినిమాలో చిరంజీవి ఇమేజ్ ను భిన్నంగా చూపించడమే కాదు.. నెల రోజుల లోపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. యావరేజ్ టాక్ తో జర్నీ మొదలు పెట్టి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ఏకంగా 512 రోజులు ఆడింది.. చిరంజీవి కెరీర్ కు మరో టర్న్ పాయింట్ గా నిలిచింది ఆ సినిమా..

చిరంజీవి హీరో మాధవి హీరోయిన్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా చిరు నటనలోని మరో కోణాన్ని ఫ్యాన్స్ కు పరిచయం చేసిందని చెప్పవచ్చు. ఇంట్లో భార్య పై ప్రేమని చూపిస్తూనే.. ఇంటి బయటకు అడుగు పెట్టగానే.. మరో స్త్రీ కోసం.. ఆనందం కోసం వెంపర్లాడే మగాడి జీవితాన్ని  ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ మూవీ ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా ఎన్నో విధాలా స్పెషల్ గా నిలిచింది. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి సినిమా.. మాటల రచయిత నుంచి ఈ సినిమాతోనే గొల్లపూడి మారుతీరావు నటుడిగా వెండి తెరపై అడుగు పెట్టారు. అంతేకాదు.. హీరో చిరంజీవి అప్పటికే యాక్షన్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో ప్యామిలీ సబ్జెక్ట్ చేసి ఒక ప్రయోగం చేశారు. చిరుకు సూపర్ ని అందించింది. కెరీర్ లో సూపర్ హిట్ మూవీల్లో ఒకటిగా నిలిచిపోయింది. చిరుకి జోడీగా మాధవి, మరో కీలకప పాత్రలో పూర్ణిమా నటించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి
Intlo Ramayya Veedhilo Kris

Intlo Ramayya Veedhilo Kris

ఈ సినిమా రిలీజ్ 1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది. దాదాపు 40ఏళ్ళు పైగా అవుతుంది. మొదట్లో యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కాని కాల‌క్ర‌మేణా ప్రేక్ష‌కాధ‌ర‌ణ పెరిగి సూప‌ర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు కలెక్షన్లు ఎలా లెక్కిస్తున్నారో.. అప్పట్లో శతదినోత్సవాన్ని గొప్పగా చెప్పుకునేవారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అప్పట్లో 512 రోజులు ఆడింది. ఈ సినిమాకు షూటింగ్ ను కేవలం 29 రోజుల్లో కంప్లీట్ చేశారు. కేవలం 3ల‌క్ష‌ల 20వేల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. పాల‌కొల్లు, న‌ర్సాపురం, పోడూరు, స‌కినేటిప‌ల్లి, భీమ‌వ‌రంలతో పాటు మద్రాస్ లో షూటింగ్ ను జరిపారు. నిర్మాత రాఘవ . సినిమా కంప్లీట్ అయిన తరువాత సెన్సార్ ఇబ్బందులను అధిగమించి అనుకున్న సమయానికి రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఒక చిన్న సినిమాను షూటింగ్ చేయాలన్నా నెలలు నెలలు సమయం తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే ఏకంగా ఏడాదికి ఏడాది షూటింగ్ ను జరుపుకుంటూనే ఉంటారు. మరి కేవలం నెల రోజుల్లోనే ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాని కంప్లీట్ చేసి.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశారు నిర్మాత రాఘవ. చిరు కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీగా నిలిచింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..