AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: తారక్‌తో తొడగొట్టించాలనుకున్నా.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన జక్కన్న

బాలీవుడ్ నుంచి వస్తోన్న బడా మూవీస్ లో బ్రహ్మాస్త (Brahmastra) ఒకటి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది.

SS Rajamouli: తారక్‌తో తొడగొట్టించాలనుకున్నా.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన జక్కన్న
Rajamouli
Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 03, 2022 | 9:58 AM

Share

బాలీవుడ్ నుంచి వస్తోన్న బడా మూవీస్ లో బ్రహ్మాస్త (Brahmastra) ఒకటి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేయనున్నారు. ఇందులో అమితాబ్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ప్రీరిలీజ్ ను నిర్వహించాలని అనుకున్నాం.. దానికోసం బాగా ఏర్పాటు చేశాం కానీ అది కుదరలేదు. కరణ్ జోహార్ వినాయకుడి పూజ సరిగ్గా చేసి ఉండరు అందుకే ప్రోగ్రాం జరగలేదు అని నవ్వుతు అన్నారు రాజమౌళి. గణేష్ నిమర్జనం జరుగుతుండటంతో పోలీసులు బందోబస్త్ కలిపించలేకపోయామన్నారు దాంతో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయామన్నారు జక్కన్న. బ్ర‌హ్మాస్త్రంలో ర‌ణ్‌భీర్ క‌పూర్ మంటను త‌న చేతి నుంచి విసిరే అద్భుత‌మైన శ‌క్తిని క‌లిగి ఉంటాడు. దాన్ని మ‌నం ట్రైల‌ర్‌లోనూ చూసుంటాం. దాన్ని లైవ్‌లో చూపించాలని మేం భారీగా ప్లాన్ చేసుకున్నాం. భారీగా ఫైర్ వర్క్స్ ను ప్లాన్ చేశాం.. కానీ కుద‌ర‌లేదు.అలాగే  తొడ‌గొట్టు చిన్నా అని ర‌ణ్‌భీర్ క‌పూర్ అడుగుతాడు. అప్పుడు ఎన్టీఆర్ తొడ‌గొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశాం. అదికూడా  కుద‌ర‌లేదు. కానీ దాన్ని బ్ర‌హ్మాస్త్ర స‌క్సెస్‌మీట్‌లో చేసి చూపిస్తాం అన్నారు జక్కన్న. మేం మా చిన్నతనంలో వెదురు క‌ర్ర‌ల‌తో బాణాలు చేసుకొని వాటిపై బ్ర‌హ్మాస్త్రం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, విష్ణాస్త్రం .. అంటూ రాసుకుని ఆడుకునేవాళ్లం. మాలాగే చాలా మంది ఆడుకునేవాళ్లు. అయాన్ ముఖర్జీ బ్ర‌హ్మాస్త్రం క‌థ చెప్పిన‌ప్పుడు నా చిన్న‌నాటి ఫాంట‌సీ విష‌యాల‌న్నీ గుర్తుకు వ‌చ్చాయి అన్నారు జక్కన్న. ఇలాంటి మంచి సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకున్నా.. చేస్తున్నా అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!