Thiru Movie: అప్పుడే ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Thiru OTT Release: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం తిరుచిట్రంపళం. తెలుగులో తిరుగా విడుదలైంది. నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించారు.
Thiru OTT Release: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం తిరుచిట్రంపళం. తెలుగులో తిరుగా విడుదలైంది. నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించారు. అలాగే దిగ్గజ దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. కేవలం తమిళ్‌లోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. సిల్వర్ స్ర్కీన్‌పై అలరించిన ఈ ప్రేమకథా చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది.
కాగా ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రాలు నెలరోజుల్లోపే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అలా ధనుష్ నటించిన తిరు కూడా నెలల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్‌నెక్ట్స్ కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సెప్టెంబర్ 17 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..