Hyderabad: కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్‌.. షాక్‌ ఇచ్చిన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు

Viral Video: కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళుతుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలను అసలు పట్టించుకోరు. ఇతరులను పట్టించుకోకుండా ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా..

Hyderabad: కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్‌.. షాక్‌ ఇచ్చిన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు
Kids In Car Boot
Follow us
Basha Shek

|

Updated on: Sep 07, 2022 | 12:44 PM

Viral Video: కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళుతుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలను అసలు పట్టించుకోరు. ఇతరులను పట్టించుకోకుండా ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా, వాహనాలను సీజ్‌ చేస్తున్నా ట్రాఫిక్‌ ఉల్లంఘనదారుల్లో ఏ మాత్రం మార్పురావడం లేదు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలను కారు డిక్కీలో కూర్చోబెట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలను కూర్చొబెట్టి పేరెంట్స్ మాత్రం ముందు వరుసలో కూర్చున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఓ బొమ్మను ఇచ్చిన వారు తమ పిల్లలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

TS7HA8607 అనే నంబర్‌ ప్లేట్‌ గల కారులో వీరు వెళుతుండగా.. వెనకాల వెళుతున్న కారులోని వారు దీనిని వీడియో తీశారు. నంబర్ ప్లేట్ బాగా కనిపించేలా జూమ్ చేసి మరీ ఈ వీడియోను తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘వారు బాధ్యత లేని తల్లిదండ్రుల్లా ఉన్నారు? దయచేసి ఈ వీడియోను చూసి తగు చర్యలు తీసుకోండి’ అని కేటీఆర్‌, తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు, టీఎస్‌ఆర్టీసీ ఎండీల పేర్లను ట్యాగ్‌ చేశాడు. ఈ పోస్టుపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్‌ ఆధారంగా చలాన్ విధించారు. ‘సార్‌.. మీ ఫిర్యాదు మేరకు సదరు వాహనదారుడికి ఈ-చలాన్ పంపాం. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్