Relationship Tips: పెళ్లయ్యాక మీ పాట్నర్‌కు మర్చిపోయి కూడా ఇలాంటి అబద్దాలు చెప్పకండి.. అలా చేస్తే ఇక అంతే..

ప్రేమ, నమ్మకం అనేది ఒకరి హృదయంలో విచ్ఛిన్నమైతే.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా, మీరు మళ్లీ మళ్లీ నమ్మకాన్ని పెంచుకోలేరు. మరోవైపు, మీ సంబంధంలో నమ్మకం లేకుంటే

Relationship Tips: పెళ్లయ్యాక మీ పాట్నర్‌కు మర్చిపోయి కూడా ఇలాంటి అబద్దాలు చెప్పకండి.. అలా చేస్తే ఇక అంతే..
Relationship Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 06, 2022 | 1:06 PM

Marriage relationship tips: ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే సంబంధాలు తెగిపోతున్నాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడం, అబద్దాలు, నిర్లక్ష్యపు ధొరణుల వల్ల ఇలాంటివి అత్యధికంగా జరుగుతున్నాయి. అయితే.. బలమైన సంబంధానికి ఒకరిపై ఒకరు నమ్మకం చాలా ముఖ్యం. ఎందుకంటే సంబంధాలు నమ్మకంతోనే నడుస్తాయి. ప్రేమ, నమ్మకం అనేది ఒకరి హృదయంలో విచ్ఛిన్నమైతే.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా, మీరు మళ్లీ మళ్లీ నమ్మకాన్ని పెంచుకోలేరు. మరోవైపు, మీ సంబంధంలో నమ్మకం లేకుంటే ఏదో ఒకరోజు మీ సంబంధం కూడా విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో మీ భాగస్వామికి మీరు ముఖ్యంగా ఎలాంటి అబద్ధం చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

మాజీ లవర్ గురించి అబద్ధం: మీ మాజీ భాగస్వామి గురించి, మీ ప్రస్తుత జీవిత భాగస్వామికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ భాగస్వామికి మీపై ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి ఇలా చేయడం మానుకోండి.

బాగానే ఉన్నట్లు నటిస్తూ ఉండకండి: మీ భాగస్వామితో గొడవలు జరుగుతున్నప్పుడు.. మీ ఆందోళనలను అణచివేసుకుంటున్నట్లు నటించకండి. వారు ఏదైనా అడిగినప్పుడు జవాబు చెప్పండి.. ఇలాంటి సందర్భంలో మాట్లాడకుండా ఉంటే.. అదే నిజం (అబద్ధం) గా భావించే అవకాశముంది. ఇలాంటి ధోరణి మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. కావున మీ భాగస్వామికి అబద్ధాలు చెప్పడం మానుకోండి.

జీతం గురించి అబద్ధం: మీ జీతం గురించి అబద్ధం చెప్పడం ద్వారా.. మీరు మీ భాగస్వామి ముందు కొద్దికాలం పాటు మాత్రమే మంచి అభిప్రాయాన్ని పొందవచ్చు. కానీ అది మీ సంబంధాన్ని బలహీనపర్చి.. తెగదెంపులు చేసుకునేలా చేస్తుంది. కావున జీతం గురించి మీ భాగస్వామికి అబద్ధాలు చెప్పకండి. ఇది మీ సంబంధంలో నమ్మకాన్ని ఉంచుతుంది.

ఏదైనా నచ్చినట్లు ఉండండి.. నటించకండి: మీకు ఏదైనా నచ్చకపోతే, మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. ఎందుకంటే మీ భాగస్వామికి నచ్చినట్లు.. నటించడం ద్వారా ఏదో ఒకరోజు నిజం రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..