Telangana Crime: దారుణం! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను గొంతు నులిమి హత్య చేసిన భార్య..

మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పచ్చని కాపురంలో అనుమానం చిచ్చురేపింది. దీంతో గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కట్టుకున్న భార్య, అత్త కలిసి గొంతునులిమి భర్తను హత్య చేశారు. వివరాల్లోకెళ్తే..

Telangana Crime: దారుణం! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను గొంతు నులిమి హత్య చేసిన భార్య..
Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 07, 2022 | 10:49 AM

Woman killed husband: మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పచ్చని కాపురంలో అనుమానం చిచ్చురేపింది. దీంతో గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కట్టుకున్న భార్య, అత్త కలిసి గొంతునులిమి భర్తను హత్య చేశారు. వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో అజీంఖాన్‌(33) సెంట్రింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన శ్రావణిని 2015లో ప్రేమించి వివాహం చేసుకుని అత్తింటిలోనే కాపురం పెట్టారు. వీరికి హమాన్‌(6), హర్మాన్‌(8) అనే ఇద్దరు కుమారులు సంతానం. పిల్లలను పాఠశాలకు పంపించి శ్రావణి కృష్ణానగర్‌లోని ఓ సంస్థలో పనికి వెళ్తూ ఉండేది. ఐతే ఆమె రోజూ ఫోన్లో అధిక సమయం మాట్లాడుతూ ఉండటాన్ని గమనించిన అజీంఖాన్‌కు భార్యపై అనుమానం కలిగింది. ఈ విషయమై మంగళవారం (సెప్టెంబర్‌ 6) సాయంత్రం భార్య, అత్త అతడితో గొడవ పడ్డారు. అనంతరం భార్య, అత్త ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లి గొంతు నులిమడంతో అతను కింద పడిపోయాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా, వారు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో మృతుడి సోదరుడు నదీమ్‌ఖాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.