ఐపీఎల్ 2026లో తుస్సుమంటే.. ఈ నలుగురి తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ.. ఇకపై నో ఎంట్రీ బోర్డే?
IPL 2026 Indian Players: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభానికి ముందు భారత క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి కొన్ని స్టార్ ఆటగాళ్లకు ఈ టోర్నీ చాలా కీలకం కానుంది. IPLలో రాణించకపోతే టీమ్ ఇండియాలో వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

IPL Impact on Team India: మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ప్రారంభ షెడ్యూల్‌లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సీజన్ కొన్ని భారత ఆటగాళ్ల కెరీర్‌ను నిర్ణయించేలా మారబోతోంది.
శుభమన్ గిల్‌కు పరీక్ష సమయం..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు ఈ సీజన్ చాలా కీలకం. వన్డే, టెస్ట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నా, టీ20లో మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. 2025లో 15 ఇన్నింగ్స్ ఆడి 291 పరుగులు చేసినా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఐపీఎల్ 2026లో కూడా విఫలమైతే టీ20 జట్టులో స్థానం దూరమయ్యే ప్రమాదం ఉంది.
రింకూ సింగ్‌పై ఒత్తిడి..
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో సాధారణ ప్రదర్శనతో అతను ప్లేయింగ్ XI నుంచి తప్పించారు. ఇప్పుడు ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తేనే అతని టీమ్ ఇండియా కెరీర్ కొనసాగుతుంది.
రుతురాజ్ గైక్వాడ్‌కు ఛాన్స్..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల మంచి టచ్ లోకి వచ్చాడు. గత సీజన్ గాయంతో మధ్యలోనే తప్పుకున్నా, ఇప్పుడు తిరిగి రాణించాలని చూస్తున్నాడు. ఐపీఎల్ లో భారీ స్కోర్లు చేస్తే టీ20 జట్టులో తిరిగి చోటు దక్కే అవకాశం ఉంది.
కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఆశలు..
వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌లో తిరిగి చోటు కోసం పోరాడుతున్నాడు. 2022 తర్వాత అతను టీ20 మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2026లో అతని ప్రదర్శన ఆధారంగానే టీమ్ ఇండియాలో తిరిగి ఎంపిక అవ్వడం జరుగుతుంది. ఈ నాలుగు ఆటగాళ్లకు ఐపీఎల్ 2026 కీలక మలుపుగా మారబోతోంది. మంచి ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులో స్థానం పక్కా, లేకపోతే భవిష్యత్తు సందిగ్ధంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
