AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poori: నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం.!

రాజస్థాన్‌లోని దిలాల్పూర్ గ్రామంలో ఒక హోటల్ పూరీలను నూనెలో కాకుండా నీళ్లలో వేయించి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వింత పద్ధతితో చేసిన పూరీలు రుచిగా, మృదువుగా ఉంటాయని యజమాని చెప్పాడు. ఆ వివరాలు ఇలా.. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

Poori: నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం.!
Poori
Ravi Kiran
|

Updated on: Mar 18, 2026 | 1:42 PM

Share

పూరీలు అందరికీ ఇష్టమైన టిఫిన్. వేడి వేడిగా, బాగా పొంగిన పూరీలు తినడం మనందరికీ ఇష్టం. సాధారణంగా, పూరీలను వేడి నూనెలో వేయించి తయారు చేస్తారు. తదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఇడ్లీ, దోసలతో పాటు పూరీ కూడా ఫేమస్. అయితే, పూరీ ఉత్తర భారతదేశంలో కూడా ఒక మెయిన్ ఫుడ్. ఇక అసలు విషయానికి వస్తే.. గతంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిలాల్పూర్ అనే గ్రామంలో ఒక వినూత్నమైన వంట పద్ధతి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఒక చిన్న హోటల్ దాని ప్రత్యేకత కారణంగా చాలా ఫేమస్ అయింది. ఈ హోటల్‌లో పూరీలను నూనెలో కాకుండా, విచిత్రంగా నీళ్లలో వేయించి తయారు చేస్తారు. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ.. ఇది నిజం.

ఈ వింత పద్ధతి గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. కస్టమర్ల రూపంలో హోటల్‌కు వెళ్లి, యజమానితో మాట్లాడి, ఆ నీటిని పరిశీలించారు. అవి నూనెలా కాకుండా తేలికగా నీరులా ఉండటంతో, పరిశీలించిన వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ నమ్మశక్యం కాని విషయం ఒకరి ద్వారా మరొకరికి తెలియడంతో, ఆ హోటల్‌కు వినియోగదారుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ వినూత్న పద్ధతి ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని ప్రయత్నించగా, హోటల్ యజమాని దానిని రహస్యంగా ఉంచాడు. “ఇది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన రహస్యం. ఇది మా జీవనోపాధి. కాబట్టి మేము దీనిని ఎవరికీ చెప్పలేము,” అని యజమాని స్పష్టం చేశాడు. అయితే, వారు అందించే పూరీలు నూనెలో వేయించిన పూరీల మాదిరిగానే మెత్తగా, రుచిగా ఉంటాయని అతను హామీ ఇచ్చాడు. “ఎలా చేసినా, దానిలో ఏం ఉన్నా, మా దగ్గరికి వచ్చేవారికి రుచికరమైన, మెత్తని పూరీలు అందించడంలో మాకు సంతోషం ఉంటుంది,” అని యజమాని తెలిపాడు. గ్రామస్థులు కూడా హోటల్ యజమాని మాటలకు వంత పలుకుతూ, వారు తమ పూర్వీకుల నుండి ఈ పూరీల వ్యాపారాన్ని చేస్తున్నారని, ఆ రహస్యాన్ని వారు ఎవరికీ చెప్పరని పేర్కొన్నారు.

ఈ వింత పద్ధతి గురించి కొంతమంది ప్రొఫెసర్‌లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి పరిశీలనల ప్రకారం, నీటి మాదిరిగా కనిపించే కొన్ని రకాల నూనెలు ఉండవచ్చని, వాటిలో బాగా మరిగించిన నీటిని కలిపినప్పుడు, ఆ నూనె తన గుణాన్ని కోల్పోయి నీరులా మారే అవకాశం ఉందని వారు సూచించారు. అయితే, ఇది అన్నిసార్లు జరిగే అవకాశం లేదని కూడా వారు స్పష్టం చేశారు. ఈ రహస్య పద్ధతి వెనుక ఉన్న వాస్తవం ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ, దిలాల్పూర్ హోటల్ తన ప్రత్యేకతతో వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంది.

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !