‘డై’యాబెటిక్ ఇంజక్షన్! బరువు తగ్గిస్తోంది.. ప్రాణం తీస్తోంది!
డయాబెటిస్ నియంత్రణ, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే GLP-1 మందులను బరువు తగ్గేందుకు సొంతంగా వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెమాగ్లూటైడ్, తిర్జెపటైడ్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే తీవ్రమైన జీర్ణ సమస్యలు, డీహైడ్రేషన్, ప్యాంక్రియాస్, కిడ్నీలపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయాలపై అధికారులు చర్యలు చేపడుతున్నారు.

‘డై’యాబెటిక్ ఇంజక్షన్! బరువు తగ్గిస్తోంది.. ప్రాణం తీస్తోంది! అందంగా మారడానికి.. జీరో సైజ్ అవ్వడానికి.. పొట్ట దగ్గర పొడుచుకుంటున్న ఆ ఒక్క ఇంజెక్షన్, ఒక్కోసారి నేరుగా స్మశానానికి తీసుకెళ్తుంది. టైప్-2 డయాబెటిస్ రోగుల ప్రాణాలు కాపాడానికి, బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడానికి శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక శక్తివంతమైన ఔషధం.. ఈరోజు విచ్చలవిడి వెయిట్ లాస్ మాఫియాగా రూపాంతరం చెందింది. ఫార్మసీలలో ప్రిస్క్రిప్షన్ లేకుండా, ల్యాబ్‌లలో ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా.. కేవలం కొవ్వు కరిగిపోతుందనే పిచ్చితో జనం ఈ డ్రగ్స్‌ను అమాయకంగా అమృతంలా తీసుకుంటున్నారు. ఒంట్లోకి ఎక్కించుకుంటున్నారు! ఇలా భయపెడితే ఎవరికీ అర్థం కాదు. నిన్నగాక మొన్న ఆస్ట్రేలియన్ లేడీ.. ‘ట్రిష్ వెబ్‌స్టర్’కు ఏం జరిగిందో డిటైల్డ్‌గా చెబితే మీకే అర్ధమవుతుంది. ఈమె పేరు ట్రిష్ వెబ్‌స్టర్. వయసు 56 ఏళ్లు. కూతురు పెళ్లిలో అందరికంటే అందంగా, సన్నగా కనిపించాలనేది ఆమె ఆశ. అందుకోసం ఆమె ఏం చేసిందో తెలుసా? నేడు ప్రపంచాన్ని ఊపేస్తున్న, మన హైదరాబాద్ గల్లీల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతున్న గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1 అనే ఇంజక్షన్ తీసుకుంది. నిజానికి ఈ మందు కనిపెట్టింది షుగర్ జబ్బు ఉన్న వాళ్లను కాపాడడం కోసం. కాని, ఇదే ఇంజక్షన్‌ను ఒక వెయిట్ లాస్ మెడిసిన్‌గా తీసుకుంది ట్రిష్ వెబ్‌స్టర్. ఐదు నెలల్లో 16 కిలోలు తగ్గింది! అందరూ మురిసిపోయారు. కానీ.. సరిగ్గా కూతురు పెళ్లికి కొన్ని రోజుల ముందు.. ఆమె నోటి నుంచి బ్రౌన్ కలర్...
