AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. వాయువ్య బంగాళాఖతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Ap Telangana Rains Update
Anand T
|

Updated on: Aug 16, 2026 | 7:17 AM

Share

ఏపీ, తెలంగాణకు రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు మరోసారి వర్ష సూచనలు జారీ చేశాయి. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో నేడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ తెలిపింది.

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఆదివారం ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.

బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతవారణ శాఖ అధికారుల ప్రకారం.. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మరికొద్ది సేపట్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడా సంభవిస్తాయని తెలిపింది.

అలాగే వర్షాల సమయంలో గంటకు 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. అంతేకాదు ఈ జిల్లాల్లోని ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us