AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే ప్రభుత్వ కొలువు మీదే!

రాష్ట్ర శాసనసభ సచివాలయంలో ఇంగ్లిష్, తెలుగు రిపోర్టర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 పోస్టులు ఉండగా.. ఎంపికైన వారికి రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతం లభిస్తుంది. డిగ్రీతో పాటు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో హైయర్ గ్రేడ్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 13 నుంచి నవంబరు 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు..

రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే ప్రభుత్వ కొలువు మీదే!
APPSC Reporter Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 06, 2026 | 6:32 AM

Share

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇంగ్లిష్ రిపోర్టర్స్, తెలుగు రిపోర్టర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 13, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 రిపోర్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇంగ్లిష్ రిపోర్టర్స్ 10 పోస్టులు, తెలుగు రిపోర్టర్ 1 పోస్టు ఉన్నాయి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లిష్ లేదా తెలుగు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో హైయర్ గ్రేడ్ ఉత్తీర్ణత ఉండాలి. తెలుగు రిపోర్టర్ పోస్టుకు అభ్యర్థులు తెలుగు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల (80 WPM) ప్రాక్టికల్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లో ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో నవంబరు 2, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబరు 13న ప్రారంభమవుతుంది.

అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో ఆన్‌లైన్ రాత పరీక్ష, షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ & ట్రాన్స్‌స్క్రిప్షన్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి. ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు పే స్కేల్ లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, షార్ట్‌హ్యాండ్/టైప్‌రైటింగ్ అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి. అనంతరం APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

AP లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రిపోర్టర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు