AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త వ్యూహం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..

ఏపీలో ఏం నడుస్తోంది? అంటే... మరోసారి ఎన్నికల వేడి రాజుకుందనే మాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పోరుకు నువ్వానేనా అన్నట్టుగా సిద్ధమవుతున్న పాలక,విపక్షాలు.. నిప్పులు రాజేస్తున్నాయ్‌. అయితే ఈ విషయంలో అధికార కూటమి.. కాసింత డోసు పెంచినట్టు కనిపిస్తోంది. పక్కా వ్యూహంతో.. మరోసారి జట్టుగానే జనాలకు కనెక్టయ్యేలా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ ప్లానేంటి?

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త వ్యూహం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
Dy CM Pawan Kalyan - CM Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Oct 06, 2026 | 7:20 AM

Share

ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నగారా మోగనున్న వేళ.. ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ఈ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి.. ఈ విషయంలో దూకుడుగా ఉన్నట్టుగా కనబడుతోంది. కూటమి సమన్వయం దెబ్బతినకుండా.. మూడు పార్టీల కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూనే.. కూటమి స్నేహం మరింత బలపడిందనే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు..

సెప్టెంబర్‌ చివర మొదలు పెడితే… లేటెస్టుగా ప్రొద్దుటూరు సభ వరకు… సీఎం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాలు ఆయన స్ట్రాటజీని స్పష్టం చేస్తున్నాయన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. అలాగని అవి ఆశామాషీ కార్యక్రమాలు కాదు. అన్నీ భారీస్థాయిలో నిర్వహించినవే. వాటన్నింటిలోనూ… కూటమికి సంబంధించి మూడు పార్టీల భాగస్వామ్యం ఉండటం విశేషం. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కేంద్రమంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయా కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉండేలా కార్యక్రమాలు ప్లాన్‌ చేశారు.

సెప్టెంబర్‌ 29న పవన్‌తో కలిసి పల్లెపండుగ

సెప్టెంబర్‌ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగతో మొదలైన ఈ వరుస కార్యక్రమాలు.. ప్రొద్దుటూరు వరకు జోష్‌ఫుల్‌గా కొనసాగాయి. పల్లెపండుగ పేరిట ఉదయగిరి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి వేలకోట్ల గ్రామీణాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు… అక్టోబర్ 2న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లక్ష కోట్ల అంచనా పెట్టుబడితో చేపట్టనున్న హార్టికల్చర్‌ హబ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ప్రారంభించారు.

విజయవాడ, విశాఖలో పేదలకు ఇళ్లపట్టాలు

దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణానికి.. తెనాలి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ఆ జోష్‌ని అలాగే కంటిన్యూ చేస్తూ… లేటెస్టుగా ప్రొద్దుటూరులో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. 30వేల,156 కోట్ల అంచనాతో చేపట్టిన ఇంటింటికీ తాగునీటి సరఫరా ప్రాజెక్టు అమరజీవి జలధారను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్‌ పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో 26వేలకుపైగా ఇళ్ల పట్టాలు పేదలకు పంపిణీ చేసిన చంద్రబాబు.. అంతకు విశాఖలో మంత్రి నాదెండ్లతో కలిసి దాదాపు 29వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఉండవల్లిలో బాబు, పవన్‌ కీలక భేటీ

ఇలా వరుస కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు… ఆయా వేదికలపై కూటమి నేతలతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ.. తమ సమన్వయాన్ని స్పష్టంగా చాటి చెప్పారు. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు కూడా… స్థానిక ఎన్నికలకు ఇదేతరహాలో సమన్వయంతో పనిచేయాలనే సంకేతాలను పంపించారు. స్థానిక ఎన్నికల్లోనూ కలిసి కట్టుగానే ముందుకెళ్తామని చెబుతున్న కూటమి నేతలు.. ఆ దిశగా బలంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస సభల్లో పాల్గొంటూ… క్యాడర్‌కు సంకేతాలు పంపుతున్న చంద్రబాబు, పవన్‌… ఇవాళ ఉండవల్లి క్యాంప్‌ ఆఫీసులో ప్రత్యేకంగా భేటీ కానుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. స్థానిక ఎన్నికల్లో కూటమి సమన్వయంపైనే ఇరువురు నేతల మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చించే అవకాశం ఉంది. బలం ఉన్న చోట పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూటమి వర్గాలు చెబుతున్నాయి. మరి స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కూటమి పెద్దలు రచించిన ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?