AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలోని 19 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, RGUKTలో లెక్చరర్ల నియామకాలకు సంబంధించిన స్క్రీనింగ్/రాత పరీక్షల షెడ్యూల్‌ను APPSC విడుదల చేసింది. 2026 డిసెంబరు 1 నుంచి 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, సమయాల పూర్తి వివరాలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు..

డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే
APPSC Assistant Professor Exam Dates
Srilakshmi C
|

Updated on: Oct 06, 2026 | 7:04 AM

Share

అమరావతి, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో లెక్చరర్ల నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్/రాత పరీక్ష (Computer Based Test) షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల్లో నోటిఫై చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, RGUKTలో లెక్చరర్ పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు 2026 డిసెంబరు 1 నుంచి డిసెంబరు 5 వరకు కొనసాగనున్నాయి. అభ్యర్థులు తమ సబ్జెక్టు/పోస్టుకు సంబంధించిన పరీక్ష తేదీ, సమయాన్ని తప్పనిసరిగా గమనించాలని APPSC సూచించింది. APPSC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఫోర్‌నూన్ (FN) పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, ఆఫ్టర్‌నూన్ (AN) పరీక్షలు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు జరుగుతాయి.

సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు డిసెంబరు 1, 2026 – ఉదయం సెషన్

ఈ సెషన్‌లో కింది సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది.. Civil Engineering, Instrumentation, Political Science, RGUKT-Chemistry, RGUKT-Information Technology, Rural Development, Sculpture, Statistics, Zoology

డిసెంబరు 1, 2026 – మధ్యాహ్నం సెషన్

Anthropology, Biotechnology, Electrical and Electronics Engineering, Geology, Management, Naval Architecture and Marine Engineering, RGUKT-Physics, Telugu

ఇవి కూడా చదవండి

డిసెంబరు 2, 2026 – ఉదయం సెషన్

Chemical Engineering, Commerce, Computer Science and Information Technology Engineering, Food Technology, Geography, Painting, Philosophy, RGUKT-Telugu

డిసెంబరు 2, 2026 – మధ్యాహ్నం సెషన్

Archaeology, Architecture and Planning, Electronics and Communication Engineering, Environmental Sciences, Geophysics, Metallurgical Engineering, Polymer Science and Technology, RGUKT-English

డిసెంబరు 3, 2026 – ఉదయం సెషన్

Building Technology, Economics, Geo-Engineering, Mathematics, Nursing, Pharmacy, RGUKT-Biology, Sanskrit, Social Work

డిసెంబరు 3, 2026 – మధ్యాహ్నం సెషన్

Biochemistry, Computer Science and Applications, Education, Electronic Science, Fishery Science and Aquaculture, Mechanical Engineering, Public Administration, RGUKT-Fine Arts, RGUKT-Yoga

డిసెంబరు 4, 2026 – ఉదయం సెషన్

Chemistry, English, Marine Biology, Mass Communication and Journalism, Microbiology, RGUKT-Library Science, RGUKT-Music, RGUKT-Physical Education, Urdu

డిసెంబరు 4, 2026 – మధ్యాహ్నం సెషన్

Architecture, Biosciences, Hindi, History, Library and Information Science, Meteorology, Physics, Visual / Fine Arts, Yoga

డిసెంబరు 5, 2026 – ఉదయం సెషన్

Botany, Design Technologies, Home Science, Law, Physical Education, Planning, Psychology, RGUKT-Mathematics, Sociology

తమ సబ్జెక్టు/పోస్టుకు సంబంధించిన పరీక్ష తేదీ, సమయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలని APPSC సూచించింది. పరీక్షకు సంబంధించిన తదుపరి తాజా సమాచారం కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపింది. APPSC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు డిసెంబరు 1 నుంచి 5, 2026 వరకు జరుగుతాయి. అభ్యర్థులు తమ సబ్జెక్టుకు కేటాయించిన సెషన్‌ను ముందుగానే నిర్ధారించుకుని పరీక్షకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..