Gold Rates: బంగారం ధరల్లో మళ్లీ మార్పు.. 10 గ్రాముల రేటు ఎంతో తెలుసా?
Gold Rate Today: అక్టోబర్ 6న బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి.

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. బులియన్ మార్కెట్ లో ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. ఇలా అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతుంటాయి. కాగా.. ఇటీవల కాస్త తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఆ తర్వాత స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం అక్టోబర్ 6 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి.. రూ.1,49,170 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,36,740 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,170 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,320, 22 క్యారెట్ల ధర రూ.1,36,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740 గా ఉంది. వెండి కిలో ధర రూ.234,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,49,170, 22 క్యారెట్ల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
