Viral Video: ఎమ్మెల్యేగారూ మీరు గ్రేట్! ఆయన ఏం చేశారో తెలిస్తే మీరూ తప్పకుండా మెచ్చుకుంటారు..
తమిళనాడు రాష్ట్రంలోని లిటంపట్టి (Litampatti) ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ధర్మపురి ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్ మంగళవారం (సెప్టెంబర్ 7) తనిఖీలు నిర్వహించారు. పాఠశాల భవనాలను, మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాల నిర్వహణ..
MLA cleaned school toilets: తమిళనాడు రాష్ట్రంలోని లిటంపట్టి (Litampatti) ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ధర్మపురి ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్ మంగళవారం (సెప్టెంబర్ 7) తనిఖీలు నిర్వహించారు. పాఠశాల భవనాలను, మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కృష్ణమ్మాల్‌తో కలిసి మరుగుదొడ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే అవి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి స్వయంగా వాటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..
‘మరుగుదొడ్లను ఇలానే శుభ్రంగా ఉంచుకోవాలి. క్లీనర్లు రాకపోతే చెప్పండి ప్రతిరోజూ నేనే వచ్చి శుభ్రంచేసి వెళ్తాను. పేద విద్యార్ధులు చదివే పాఠశాల శుభ్రంగా ఉండాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. ఈ క్రమంలో పాఠశాలలోని ఇతర మరుగుదొడ్లు అపరిశుభ్రంగా, నిరుపయోగంగా ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. దోమలు కూడా అధికంగా ఉండటాన్ని ఆయన గమనించారు. పాఠశాల ఆవరణ మొత్తం దోమల మందు చల్లించాలని బీడీవోకు తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే విద్యార్థినులు వినియోగించుకోలేకపోతున్నారని, పారిశుద్ధ్య కార్మికులను సక్రమంగా నియమించాలని, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను తొలగించి, నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి ఆధునిక సౌకర్యాలతో నూతన మరుగుదొడ్లు నిర్మిస్తానన్నారు. ఇందులో శానిటరీ న్యాప్‌కిన్ డిస్పోజల్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలకు ఉన్నత పాఠశాల హోదా కల్పించాలని శాసనసభలో మాట్లాడుతానని, ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి నేరుగా విజ్ఞప్తి చేయబోతున్నట్లు ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.