SBI Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5,008 ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో ఖాళీలు..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేసే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో.. 5,008 జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల (Junilr Associate Posts) భర్తీకి..

SBI Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5,008 ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో ఖాళీలు..
SBI
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2022 | 7:29 AM

SBI Junilr Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేసే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో.. 5,008 జూనియర్‌ అసోసియేట్ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల (Junilr Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీనాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1994 నుంచి ఆగస్టు 1, 2022వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలోజనరల్ అభ్యర్ధులు రూ.750లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌ 2022లో, మెయిన్స్ పరీక్ష డిసెంబర్‌ 2022 లేదా జనవరి 20223లో జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19.900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు ఇవే..

  • అహ్మదాబాద్‌లో ఖాళీలు: 357
  • బెంగళూరులో ఖాళీలు: 316
  • భోపాల్‌లో ఖాళీలు: 481
  • బెంగాల్‌లో ఖాళీలు: 376
  • భువనేశ్వర్‌లో ఖాళీలు: 170
  • చండీగఢ్‌లో ఖాళీలు: 225
  • చెన్నైలో ఖాళీలు: 362
  • ఢిల్లీలో ఖాళీలు: 152
  • హైదరాబాద్‌లో ఖాళీలు: 225
  • జైపుర్‌లో ఖాళీలు: 284
  • కేరళలో ఖాళీలు: 273
  • ఢిల్లీలో ఖాళీలు: 631
  • ముంబాయిలో ఖాళీలు: 747
  • మహారాష్ట్రలో ఖాళీలు: 50
  • నార్త్‌ ఈస్టర్న్‌లో ఖాళీలు: 359

రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు, 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో గంట సమయంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా