Balapur Ganesh Laddu Auction: రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. ఈసారి ఎంత పలికిందంటే..

Balapur Ganesh Laddu Auction: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డూ వేలంలో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసింది. వేలంపాటలో లడ్డూ రూ. 24.60 లక్షలు పలికింది. ఇది గతేడాది కంటే రూ. 5.70 లక్షలు అధికం..

Balapur Ganesh Laddu Auction: రికార్డ్ బ్రేక్ చేసిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. ఈసారి ఎంత పలికిందంటే..
Balapur Ganesh Laddu
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 09, 2022 | 12:52 PM

Balapur Ganesh Laddu Auction: కొత్త రికార్డు. సరికొత్త రికార్డు క్రియేట్‌ అయింది. బాలాపూర్‌ లడ్డూ రికార్డు సృష్టించింది. ఈసారి లడ్డూ 24 లక్షల 60 వేల రూపాయలు పలికింది. గత ఏడాది కంటే 5 లక్షల 70 వేలు అధికం. బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ్‌ సమితికి చెందిన వంగేటి లక్ష్మారెడ్డి ఈసారి లడ్డూ దక్కించుకున్నారు. బాలాపూర్ నివాసి, టీఆర్ఎస్ నేత అయిన లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను అందుకున్నారు.

2019లో బాలాపూర్‌ లడ్డూ రూ. 17.60 లక్షలు పలికింది. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు. 2021లో రూ. 18.90 లక్షల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. 2019 కంటే రూ.1.30 లక్షలు అధికంగా వచ్చాయి. కానీ, ఈసారి రికార్డు ధర పలికింది. ఏకంగా రూ. 24.60 లక్షలు పలికి ఔరా అనిపించింది.

బాలాపూర్‌ లడ్డూ దక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు వంగేటి లక్ష్మారెడ్డి. మూడు రోజులు పూజలు నిర్వహించిన తర్వాత బంధువులు, మిత్రులకు లడ్డూ పంపిణీ చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

బాలాపూర్‌ లడ్డూ వేలం 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 1994లో గణేష్‌ చేతిలో లడ్డూను వేలం వేయగా 450 రూపాయలకు స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 1995,1998, 2004, 2008లో మోహన్‌ రెడ్డి లడ్డూ అందుకున్నారు. ఇప్పటివరకూ 27 సార్లు వేలం వేశారు. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు. ఈ ఏడాది రూ. 24.60 లక్షల పలకడంతో రికార్డు క్రియేట్‌ అయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..