Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Visarjan 2022: బై బై గణేశ.. కోలాహలంగా గణనాథుని నిమజ్జన మహోత్సవం.. ఎటు చూసినా గణపతి బప్పా మోరియా నినాదాలే

Ganesh Visarjan 2022 Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. గణనాథులు ఒక్కొక్కటిగా ట్యాంకుబండ్‌ బాటపడుతున్నాయి. పాతబస్తీ చార్మినార్‌, మోజాంజాహి మార్కెట్‌ నుంచి భారీ సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌ సాగర్‌ చేరుకుంటున్నాయి.

Ganesh Visarjan 2022: బై బై గణేశ.. కోలాహలంగా గణనాథుని నిమజ్జన మహోత్సవం.. ఎటు చూసినా గణపతి బప్పా మోరియా నినాదాలే
Hyderabad Ganesh visarjan 2022
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 09, 2022 | 9:55 AM

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. గణనాథులు ఒక్కొక్కటిగా ట్యాంకుబండ్‌ బాటపడుతున్నాయి. పాతబస్తీ చార్మినార్‌, మోజాంజాహి మార్కెట్‌ నుంచి భారీ సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌ సాగర్‌ చేరుకుంటున్నాయి. శోభాయాత్రలో యువత, పిల్లలు డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. బ్యాండు, డీజీలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. నిమజ్జన శోభాయాత్రలో కోలాటం, భజనలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భాగ్య నగరం నలుమూలల నుంచి వస్తున్న గణనాథులతో ట్యాంకుబండ్‌ ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ఎన్టీఆర్‌ మార్గ్‌ భక్తులతో కిక్కిరిసిపోయింది.

భాగ్య నగరంలో ఎటు చూసినా గణపతి బప్పా మోరియా నినాదాలే వినిపిస్తున్నాయి. చిన్నారులు, యువత డ్యాన్సు స్టెప్పులతో అదరగొడుతుండగా.. మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యం చేస్తూ అలరిస్తున్నారు. గణనాథులను భారీ ట్రాలీలలో ట్యాంకుబండ్‌కు తరలిస్తున్నారు. ట్యాలీలపైనే డ్యాన్సులు, బ్యాండు మోగిస్తూ యువకులు ఆడిపాడుతున్నారు. నిమజ్జన కోలాహలంతో హైదరాబాద్‌ ఎంజే మార్కెట్‌ పరిసరాలు కలర్‌ఫుల్‌గా మారాయి. డీజేపాటలు, భక్తుల డ్యాన్సులతో నిమజ్జన ఊరేగింపు శోభాయమానంగా సాగుతోంది. గణపతి పప్పా మోరియా అంటూ చిన్నారుల కేరింతలతో హోరెత్తిస్తున్నారు.

గణేశ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

ఇవి కూడా చదవండి

వేలసంఖ్యలో వచ్చే గణనాథుల నిమజ్జనానికి  సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. 20 వేలకు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జానానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ట్యాంకుబండ్‌ దగ్గర 22 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. మూడు వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాగర్‌ చుట్టూ 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 168 యాక్షన్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచింది జీహెచ్‌ఎంసీ. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఈ ఆంక్షలు రేపు ఉదయం వరకు కొనసాగనున్నాయి.

ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర..

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. తుది పూజల అనంతరం గణనాథుడిని మరి కాసేపట్లో ట్రాలీపైకి ఎక్కించనున్నారు. ఖైరతాబాద్‌ భారీ గణనాధుడి నిమజ్జనం కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని.. అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ మహాగణపతి నిమజ్జనం కానుంది. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని తయారు చేసింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్ట్ ఆదేశించింది. అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలనే సందేశాన్ని చెప్తూ.. ఈ సారి ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహానికి స్వస్తి పలికింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ.

బాలాపూర్ వినాయకుడు..

బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు పూర్తయింది. ప్రతిష్ఠాత్మక లడ్డూవేలంపాట ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యేకం. ఇక్కడ రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం పలుకుతుంది. లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర మొదలుకానుంది. తీన్మార్ బ్యాండ్ స్టెప్పులు, భక్తుల కోలాహలంతో నిమజ్జనం కొనసాగనుంది.

గతేడాది కూడా బాలాపూర్‌ లడ్డూ రికార్డ్‌ సృష్టించింది. 2019లో 17.60 లక్షలు పలికింది. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు. 2021లో 18లక్షల 90వేల రూపాయల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధికంగా వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో పలకవచ్చని ఉత్సవ సమితి భావిస్తోంది. బాలాపూర్‌ లడ్డూ వేలం 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 1994లో గణేష్‌ చేతిలో లడ్డూను వేలం వేయగా 450 రూపాయలకు స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 1995.1998,2004,2008లో మోహన్‌ రెడ్డి లడ్డూ అందుకున్నారు. ఇప్పటివరకూ 27 సార్లు వేలం వేశారు. 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్‌ గణపతి నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఆఖరిపూజ పూర్తిచేసుకున్న లంబోదరుడు గ్రామ ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్​పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగిస్తారు. గణేష్‌ మెయిన్‌ సెంటర్‌కు చేరుకోగానే వేలంపాట ప్రారంభిస్తారు.

బైంసాలో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతం..

నిర్మల్‌ జిల్లా భైంసాలో గణేశ్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. చిట్యాలలో వినాయక నిమజ్జనం కన్నులపండువగా జరిగింది. ఆలయం దగ్గర జడకొప్పుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా మహిళలు, యువత కోలాటమాడారు. ఎలాంటి అలజడి లేకుండా 129 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు భక్తులు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన శోభాయాత్రలో యువత కేరింతలు, డ్యాన్సులతో అదరగొట్టగా.. మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యం చేస్తూ గణనాథులకు వీడ్కోలు పలికారు.

నిర్మల్‌ జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలకు ముందుగా పోలీసులు కవాతు చేశారు. 400 మంది పోలీసులు వీధుల్లో కవాతు చేస్తూ భరోసా కల్పించారు. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..