Hyderabad: శుక్రవారం గణేశ్‌ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన..

గణేశ్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.

Hyderabad: శుక్రవారం గణేశ్‌ నిమజ్జనాల  నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన..
Hyderabad Metro
Follow us

|

Updated on: Sep 08, 2022 | 7:34 PM

Hyderabad Metro Rail : శుక్రవారం హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ సంబరం జరగనుంది. ఖైరతాబాద్ సహా పలు వివాయక  విగ్రహాలు ఊరేగింపుతో వెళ్లి నిమజ్జనం అవ్వనున్నాయి. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. జనాల మూమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకంది. శుక్రవారం(సెప్టెంబర్ 9) హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైళ్ల  ట్రిప్పులు, సమయం పొడిగిస్తున్నట్లు  మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. చివరి స్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు లాస్ట్ రైల్ బయలుదేరుతుందని చెప్పారు. నిమజ్జన ప్రక్రియను చూడాలనుకునే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు, మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా గురువారం రాత్రి 11గంటల వరకు భక్తులకు.. ఖైరతాబాద్ గణనాధుని దర్శనం కల్పిస్తామని చెప్పారు గణేశ్ ఉత్సవ సమితి. 12 గంటలకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కలశ పూజ నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య గణపతిని లారీ మీద ఎక్కించే ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం శోభాయాత్ర మొదలవుతుందంటున్నారు ఉత్సవ సమితి సభ్యులు. ఇటు.. హైదరాబాద్‌ పాతబస్తీలోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పాతబస్తీలో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. పాతబస్తీ-బాలాపూర్‌ గణేశ్‌ ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు కమిషనర్‌ సీవీ ఆనంద్‌. ఎలక్ట్రిక్ సిటీ, GHMC డిపార్ట్‌మెంట్ రూట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్, సిమెంట్ బారికేడ్లను తొలగించారు. కాగా హైదరాబాద్‌ గణేషుల్లో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత… మరో సెంటరాఫ్ ఎట్రాక్షన్ బాలాపూర్ గణేషుడే. కేశవగిరి నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర సాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..