Hyderabad: “వర్షాలు కురిసినా అంతరాయం కలగదు”.. వినాయక నిమజ్జనాలపై మేయర్ విజయలక్ష్మి క్లారిటీ
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో రేపటి నుంచి గణేశ్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరగనుంది. మరోవైపు.. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో రేపటి నుంచి గణేశ్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరగనుంది. మరోవైపు.. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ (Mayor Vijayalaxmi) గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం జోనల్ కమిషనర్ లను డీసీ, ఇంజినీరింగ్ అధికారులతో మేయర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో గానీ రోడ్డు పై నిలిచిన నీటిని సత్వరమే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర రూట్ మ్యాప్ మార్గంలోని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ లను కోరారు. నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద ప్రజలకు తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా నిరంతంగా విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారుర. పరిసరాలు అపరిశుభ్రతకు గురవకుండా ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి సూచించారు.
మరోవైపు.. గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఎలాంటి నిబంధనలు లేవని, బీజేపీ నేతలు కావాలనే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పండగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు బందోబస్తు నడుమ పక్కాగా జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా జరగని విధంగా హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు నిమజ్జనం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాగా.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని వెల్లడించింది. రేపటి సెలవుకు (Holiday) బదులుగా నవంబరు 12న (రెండో శనివారం) పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..