FCI: ఎఫ్‌సీఐ లో 5,043 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. వారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది. 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం FCI రిక్రూట్‌మెంట్ - 2022 ప్రకటన జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు...
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది. 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం FCI రిక్రూట్‌మెంట్ – 2022 ప్రకటన జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా FCI లో అకౌంట్స్, డిపో, టెక్నికల్, జనరల్, ఇతర వివిధ విభాగాల కోసం 5,043 ఖాళీలను నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD/ మాజీ సైనికులు/మహిళలు, సేవలందిస్తున్న డిఫెన్స్ సిబ్బంది వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు. వయస్సు పరిమితి, ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు ఇతర ముఖ్యమైన వివరాలను నోటిఫికేషన్ లో స్పష్టం గా పేర్కొన్నారు.
FCI రిక్రూట్‌మెంట్ 2022 అప్లికేషన్ లింక్
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6, 2022 నుంచి ప్రారంభమైం. FCI రిక్రూట్‌మెంట్ – 2022కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 5 గా నిర్ణయించారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య జోన్‌ల కోసం ఖాళీలను జారీ చేసింది. అభ్యర్థులు పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ స్టెప్స్ ను పాటించండి.
FCI రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ లింక్
ముందుగా FCI రిక్రూట్‌మెంట్ – 2022 లోకి వెళ్లి, అధికారిక వెబ్‌సైట్ recruitmentfci.in ను క్లిక్ చేయాలి. రిక్రూట్‌మెంట్ అడ్వర్టైజ్‌మెంట్ నం. 01/ 2022-FCI కేటగిరీ-III తేదీ 03.09.2022ను ఓపెన్ చేయాలి. లాగిన్/రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు నమోదు చేసుకుని, సూచనల ఆధారంగా లాగిన్ అవ్వాలి. FCI రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. వివరాలను నమోదు చేసి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, సబ్ మిట్ చేయాలి. అనంతరం వీలైతే ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..