Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి.. నీటమునిగిన నిడమనూరు, నర్సింహులగూడెం..

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. కాలువ నుంచి ఊళ్లలోకి నీరు

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి.. నీటమునిగిన నిడమనూరు, నర్సింహులగూడెం..
Sagar Canal
Follow us

|

Updated on: Sep 08, 2022 | 1:23 PM

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. కాలువ నుంచి ఊళ్లలోకి నీరు ప్రవహిస్తున్నాయి. గండిపడిన చోట కాలువ సుడిగుండాన్ని తలపిస్తోంది. కాగా, గండి నుంచి బయటకు వస్తు్న్న నీరు.. నిడమనూరు, నర్సింహులగూడుం గ్రామాల్లో ఇళ్లలోకి వస్తున్నాయి. మిర్యాలగూడ-దేవరకొండ రహదారిపైకి భారీగా నీరు వస్తోంది. దాంతో ఆ దారిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. నిడమనూరు మినీ గురుకుల పాఠశాల నీట మునిగింది. పెద్దవూరకు చెందిన 87 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు.

కాగా, గండి పడడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. అయితే.. అప్పటికే నీరంతా 500 ఎకరాల్లో పంటల్ని ముంచేసింది. నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాల్లో ఏడు అడుగుల ఎత్తులో నీరు చేరింది. వందల ఎకరాల్లోకి వరద రావడంతో.. భారీగా పంట నష్టం జరిగింది. కాలువలోకి ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో.. ప్రవాహం కాస్త తగ్గింది. యూటీ దగ్గర లీకేజీ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గండి పడిన వెంటనే ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో గండిని పూర్తిగా పూడ్చివేస్తామని చెప్పారు నాగార్జునసాగర్ సిఈ శ్రీకాంత్‌.

ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. ముంపు ప్రభావిత ప్రాంతంలోని విద్యార్థులను, నిడమనూరులోని 20 కుటుంబాలను తరలించామని తెలిపారు. హాలియా డైవర్షన్ నుంచి వాగులోకి వదులుతున్నామని చెప్పారు. ఉదయం వరకు నీరు మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మినీ గురుకులాన్ని రేపు ఉదయం శానిటేషణ్ చేసి, తిరిగి పాఠశాలలోకి విద్యార్థులను పంపిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..!
ఈ హాట్ బ్యూటీ శివాజీతోనూ నటించిందా..!
ట్రెండింగ్‌లో మెగా పవర్‌స్టార్‌ లుక్స్‌.! ఆడియన్స్‌కు మరో షాక్.?
ట్రెండింగ్‌లో మెగా పవర్‌స్టార్‌ లుక్స్‌.! ఆడియన్స్‌కు మరో షాక్.?
దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!
దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెరిగిన జాబ్‌ ఆఫర్స్‌..!
ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెరిగిన జాబ్‌ ఆఫర్స్‌..!
స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి!
స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై గీతలు పడ్డాయా? ఇలా సులభంగా తొలగించండి!
జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు
జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు
షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?
రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే