Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బుస్సుమంటూ పడగ విప్పిన కింగ్ కోబ్రా.. ‘ఊకో ఊకో’ అంటూ పడగపై ఒక్కటిచ్చిన వ్యక్తి..

Viral Video: ఎలాంటి హానీ తలపెట్టని, విష రహిత పసరిక పామును చూస్తేనే జడుసుకునే వారు ఉన్న ఈ సమాజంలో.. ఒక్క కాటు విషంతో వంద మందిని చంపేయగల..

Viral Video: బుస్సుమంటూ పడగ విప్పిన కింగ్ కోబ్రా.. ‘ఊకో ఊకో’ అంటూ పడగపై ఒక్కటిచ్చిన వ్యక్తి..
King Cobra
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 06, 2022 | 12:36 PM

Viral Video: ఎలాంటి హానీ తలపెట్టని, విష రహిత పసరిక పామును చూస్తేనే జడుసుకునే వారు ఉన్న ఈ సమాజంలో.. ఒక్క కాటు విషంతో వంద మందిని చంపేయగల కింగ్ కోబ్రాను సైతం బుజ్జగించేవారు చాలా మందే ఉన్నారు. ప్రాణాంతకమైన పాములతో స్నేహం చేసేవారు చాలా మందే ఉంటారు. వాటితో ఆడుకోవడం, వాటితో సహజీవనం చేసే వారు కూడా ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కోబ్రాలలో అతిపెద్ద పాము కింగ్ కోబ్రా. ఇది భారీ సైజులో పెరగడంతో పాటు.. దీని విషం అత్యంత ప్రమాదకరమైంది. ఇది కాటు వేస్తే నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతారు. అందుకే దీని పేరు వింటేనే చాలా మంది హడలిపోతారు. కానీ, కొందరు మాత్రం ఆ పామును పూచికపుల్లతో సమానంగా చూస్తారు. ఎంతలా అంటే.. అది కాటేసేందుకు వచ్చినా, ఏదో ఆట బొమ్మను తీసేసినట్లుగా పక్కకు ఈజీగా తీసేస్తారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అచ్చం అలాంటి వ్యక్తే ఉన్నాడు. చిన్నపాటి గది మాదిరిగా ఉన్న ప్రాంతంలో వందలాది విషపూరిత పాముల కుప్ప ఉంది. ఇందులో నాగుపాములు, కింగ్ కోబ్రాలు ఉన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి బ్యాగు పట్టుకుని పాముల మధ్యలోకి వచ్చాడు. ఏదో పాము కోసం వెతుకుతున్నట్లున్నాడు. అటూ ఇటూ కలియతిరిగాడు. ఇంతలో వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతు పడగ విప్పింది. కాటేసేందుకు ట్రై చేసింది. దాంతో అతనికి కోపం వచ్చింది. ఓవర్ యాక్షన్ చాల్లే అన్నట్లు.. దాని పడగ మీద చేతితో ఒక్కటిచ్చాడు. దెబ్బకు బిత్తరపోయిన పాము.. అక్కడి నుంచి తుర్రుమని జారుకుంది. ఈ పన్నీ, భయానకమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వీడియోను చూసి నెటిజన్లు కాస్త భయం, ఇంకా నవ్వుతో సరదాగా ఆస్వాధిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!