Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ప్రతిసారి అక్కడ తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే, ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోండి..!

Health Tips: అసంబద్ధమైన జీవనశైలి శరీరంలో అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వ్యాధులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్..

Health Tips: ప్రతిసారి అక్కడ తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే, ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోండి..!
Health Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 05, 2022 | 6:50 PM

Health Tips: అసంబద్ధమైన జీవనశైలి శరీరంలో అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వ్యాధులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్.. కణ త్వచాలు, విటమిన్ డి, హర్మోన్లను రూపొందించడానికి కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన మైనపు కొవ్వు పదార్థం. కొలెస్ట్రాల్ శరీరంలోని వివిధ భాగాలకు లిపోప్రోటీన్ అని పిలువబడే ఒక కణం ద్వారా రవాణా చేయబడుతుంది. దీని ఉపరితలంపై ఒక నిర్ధిష్టమైన ప్రోటీన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అధిక కొవ్వు, తక్కువ ప్రోటీన్ కంటెంట్ కలిగిన లిపోప్రోటీన్లతో కలిపి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లను ఏర్పరుచుకున్నప్పుడు మాత్రమే అది శరీరానికి హానీకరం అవుతుంది. ఆహారంలో అనారోగ్యకరమైన పదార్థాలు, కొవ్వు పదార్థాలను చేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య ఏర్పడుతుంది.

ధమనులలో ఎల్‌డిఎల్ కొవ్వు పేరుకుపోవడం వలన, అది గుండె నుంచి రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే తప్ప ఈ కొలెస్ట్రాల్‌ను ఎవరూ సులభంగా గ్రహించలేరు. కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోడం చాలా ముఖ్యం. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే శరీరంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ఛాతీ నొప్పి, కాళ్లు చల్లబడటం, తరచుగా ఊపిరి ఆడకపోవడం, వికారం, అలసట, రక్తపోటు పెరగడం మొదలైన సమస్యలు వస్తాయి. ఇది కాకుండా, అధిక కొలెస్ట్రాల్‌కు సంబంధించిన లక్షణాలు పాదాలలో ఎక్కువగా కనిపిస్తాయి. శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా నడుస్తున్నప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు వస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉంటే.. కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవాలి.

ఎక్కువసేపు కాళ్లను ఊపుతూ కూర్చుంటే కాళ్లు ఉబ్బుతాయి. ఈ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా సంభవించవచ్చు. వాస్తవానికి కాళ్లను కిందికి వేలాడేసి కూర్చోవడం వల్ల శరీరంలోని కింది భాగంలో రక్త ప్రసరణకు ఆటంకాలు ఎదురవుతాయి. దీని వల్ల ఆ ప్రాంతంలో కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. శరీరంలోని కింది భాగానికి రక్తప్రసరణ తగ్గినప్పుడు, కాలి గోళ్లు, చర్మం రంగు కూడా మారుతుంది. పోషకాలు, ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే రక్త ప్రసరణ తగ్గడం వల్ల కణాలకు సరైన పోషకాహారం లభించకపోవడమే దీనికి ప్రధాన కారణం. పాదాలు చల్లగా మారడానికి ఇదే కారణం. వేసవిలో కూడా మీరు చలికాలం మాదిరిగా చల్లగా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..