Viral: అర్థరాత్రి ముద్దుల వర్షం.. ప్రియుడేగా అని లైట్ తీసుకున్న యువతి.. కళ్లు తెరిచి చూస్తే గుండే గుభేల్..!

Viral: ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న ఓ యువతికి అనుకోకుండా ఓ రోజు బిగ్ షాక్ తగిలింది. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా.. అకస్మాత్తుగా ముద్దులు పెడుతున్నట్లు అనిపించింది.

Viral: అర్థరాత్రి ముద్దుల వర్షం.. ప్రియుడేగా అని లైట్ తీసుకున్న యువతి.. కళ్లు తెరిచి చూస్తే గుండే గుభేల్..!
Viral
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 05, 2022 | 4:11 PM

Viral: ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న ఓ యువతికి అనుకోకుండా ఓ రోజు బిగ్ షాక్ తగిలింది. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా.. అకస్మాత్తుగా ముద్దులు పెడుతున్నట్లు అనిపించింది. తొలుత ప్రియుడే కదా అని లైట్ తీసుకున్న యువతి.. కాసేపటి తరువాత కళ్లు తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది. దెబ్బకు జడుసుకుని.. బిక్కు బిక్కుమంటూ ఓ మూలన నక్కింది. విషయాన్ని ప్రేమికుడికి చెప్పగా.. అతను సైతం భయాందోళనకు గురయ్యాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ప్రేమికులిద్దరూ ఎందుకు అంతలా భయపడ్డారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

షిన్ మిన్(30), ఆమె ప్రియుడు మే 2021లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇది సింగపూర్‌లోని హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ నిర్మించిన పబ్లిక్ హౌసింగ్ ఫ్లాట్. ఆ సంవత్సరం జూన్‌లో ప్లాట్ ఓనర్ వారికి అదిరిపోయే పార్టీతో స్వాగతం పలికాడు. ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం తమ ప్లాట్‌కు వెళ్లి నిద్రపోయారు. అయితే, వీరికి నగ్నంగా నిద్రించే అలవాటు ఉంది. ఇక రాత్రివేళ నిద్రపోయిన తరువాత షిన్ మిన్ శరీరాన్ని ఎవరో తాకడం ప్రారంభించారు. ముద్దులు కూడా పెట్టారు. దాంతో మొదట తన ప్రియుడే అనుకుని భావించింది. మెళ్లగా కళ్లు తెరిచి చూసింది. చీకట్లో కదులుతున్న నీడ మాత్రమే ఆమెకు కనిపించింది. ఆమె ప్రియుడికి బట్టతల ఉంది. కానీ, ఆమెకు తాకున్న నీడ తలపై దట్టమైన జుట్టు ఉంది. ఆ తరువాత టాయిలెట్ వైపునకు చూడగా అక్కడ ఆమె ప్రియుడు స్నానం చేస్తూ కనిపించాడు. దాంతో ఆమె కళ్లు బైర్లుకమ్మాయి. మరి ఇక్కడ తనకు ముద్దులు పెడుతున్నది ఎవరా? అని షాక్ అయ్యింది. భయంతో బిగుసుకుపోయింది. విషయం మొత్తాన్ని ప్రియుడికి తెలిపింది.

అయితే, అతని అనుమానం ఇంటి యజమానిపై పడింది. మరోవైపు.. కనిపించిన నీడ దెయ్యమా? అనే అనుమానాలూ రెకెత్తాయి. ‘ప్లాట్ యజమాని, అతని భార్య తరచుగా దేవతలకు పూజలు చేయడానికి వెళ్తుంటారు. ఇంట్లో దెయ్యం ఉందేమో, అందుకే వారు అలా దైవ దర్శనాలకు వెళ్తున్నారేమో.’ అని వారు అభిప్రాయపడ్డారు. అయితే, నీడ రావడం, ఇలా లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని వారిద్దరూ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ వెంటనే గదిలో సీసీకెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే నగ్నంగా నిద్రపోవడం మానేశారు.

ఈ ఘటన అయిపోయిన తరువాత తాజాగా ఆగస్టు 14వ తేదీన ఇంటి యజమాని మరోసారి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో మళ్లీ మద్యం ఫుల్లుగా సేవించారు. షిన్ మిన్ మళ్లీ తన ప్రియుడితో కలిసి హాయిగా నిద్రపోయింది. అయితే, ఈసారి జరిగిన సీన్ అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అర్థరాత్రి 12.56 గంటలకు ఒక వ్యక్తి చేయి పడకగది తలుపు తెరిచి లైట్‌ను ఆఫ్ చేశారు. వెంటనే కెమెరా నైట్ విజన్‌కు మారింది. అయితే, రాత్రి వీరిలో గదిలోకి దూరిన నిరాకార మూర్తి మరెవరో కాదు.. వారి ఇంటి యజమానే. అవును, ఇంటి ఓనర్ వారి ప్లాట్‌లోకి ప్రవేశించి షిన్ మిన్ శరీరాన్ని అసభ్యంగా తాకాడు. ఈ సీన్ అంతా సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. అయితే, షిన్ మిన్ ఈసారి నిద్రపోలేదు. కేవలం నిద్రపోయినట్లు నటిస్తోంది. ఆమె భాగస్వామి కూడా నటిస్తూనే ఉన్నాడు. ఆ వెంటనే అతను నిద్ర లేస్తాడు. దాంతో ఆ యజమాని అక్కడి నుంచి ఉడాయించాడు. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇంటి యజమానిపై పోలీసలుకు కంప్లైంట్ ఇచ్చింది షిన్ మిన్. ఆగస్టు 29న సింగపూర్ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా, తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించింది షిన్ మిన్.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..