Ranbir alia: ఇది సార్.. మా రేంజ్‌.! ఓ రేంజ్ లో టాలీవుడ్ స్టామినా గురించి కామెంట్స్ అండ్ మీమ్స్..

Ranbir alia: ఇది సార్.. మా రేంజ్‌.! ఓ రేంజ్ లో టాలీవుడ్ స్టామినా గురించి కామెంట్స్ అండ్ మీమ్స్..

Anil kumar poka

|

Updated on: Sep 05, 2022 | 2:01 PM

ఇండియా బయటే కాదు.. లోపల కూడా.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనే ఫీలింగ్ నార్త్‌ లో బలంగా ఉంది. ఉండడమే కాదు సినిమాలన్నా... కంటెంట్ అన్నా.. మేకింగ్ అన్నా..



ఇండియా బయటే కాదు.. లోపల కూడా.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనే ఫీలింగ్ నార్త్‌ లో బలంగా ఉంది. ఉండడమే కాదు సినిమాలన్నా… కంటెంట్ అన్నా.. మేకింగ్ అన్నా.. తమదే గ్రేట్ అనే థింకింగ్ కూడా వారిలో ఉంది. కాని ఇది ఎప్పటి వరకు.. నిన్న మొన్నటి వరకు. ఇంకో మాటలో చెప్పాలంటే.. బాహుబలి సినిమా హిట్టు అయ్యేంత వరకు. పాన్ ఇండియా ట్రెండ్‌ను టాలీవుడ్ మొదలెట్టేంత వరకు! ఎస్ ! ఎప్పుడైతే జక్కన్న తన మాగ్నిమమ్ ఓపెస్‌ను బాలీవుడ్ రూపంలో బాలీవుడ్ కు చూపించారో.., అప్పటి నుంచి బాలీవుడ్ మన వైపు చూడడం మొదలెట్టింది. మొదలెట్టడమే కాదు.. ఆఫ్టర్ కరోనా.. టాలీవుడ్ సినిమాలు పానన్ ఇండియా రేంజ్‌ లో క్రియేట్ చేస్తున్న బజ్‌ను కని నోరెళ్ల బెట్టే దశకు చేరుకుంది. ఇక చేసేదేం లేదన్నట్టు.. బాలీవుడ్ కూడా పాన్ ఇండియా సినిమాలను మొదలెట్టి… సౌత్‌ లో ప్రమోట్ చేసుకునేందుకు టాలీవుడ్ సెలబ్రెటీలను ఆశ్రయిస్తోంది.అలా తాజాగా బ్రహ్మస్త్ర టీం కూడా… రాజమౌళి వెంట పడుతోంది. అదే సినిమాలో యాక్ట్ చేసిన నాగ్‌ను రంగంలోకి దించి మరీ ముందు పెడుతోంది. నార్త్‌ కంటే.. ఎక్కువ గా సౌత్‌లో కలెక్షన్లను రాబట్టేందుకు ప్రమోషన్ను పరుగులెత్తిస్తోంది. అంతేనా.. రీసెంట్ గా బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైనా కూడా.. ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ.. ఎన్టీఆర్‌తో మాట్లాడించి మరీ.. ఈ సినిమాను ను జానాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బ్రహ్మస్త్ర టీం. అంతే కాదు సుమ ఫేమస్‌ షో … క్యాష్‌లో కూడా ఈ మూవీ హీరో రణ్మీర్, హీరోయిన్ ఆలియా పాల్గొనేలా ప్లాన్ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో బయటికి రావడంతో.. ఇది మారేంజ్‌ అంటూ.. టాలీవుడ్ స్టామినా గురించి కామెంట్స్ అండ్ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్డే అంటూ వారు నెట్టింట కోట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 05, 2022 02:00 PM