Health News: లేచి నిలబడితే తల తిరగుతోందా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేయండి..!

Health News: కారణం లేకుండా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? మీరు లేచి నిలబడితే తల తిరుగుతోందా? కొన్ని కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఒత్తిడి కారణంగా వస్తుంది.

Health News: లేచి నిలబడితే తల తిరగుతోందా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేయండి..!
Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 05, 2022 | 5:22 PM

Health News: కారణం లేకుండా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? మీరు లేచి నిలబడితే తల తిరుగుతోందా? కొన్ని కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఒత్తిడి కారణంగా వస్తుంది. మరొకొన్నిసార్లు రక్తపోటు కారణంగా వస్తుంది. అయితే, ఇవేవీ కాకుండా తల తిరిగినట్లు అనిపిస్తే మాత్రం.. ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైద్య పరిభాషలో దీనిని వెర్టిగో అంటారు. అదికాకుండా ఇది ఒక వ్యాధి లక్షణంగా కూడా పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. అయితే, ఎలాంటి అనారోగ్యం లేకుండా నిరంతరం మైకంగా, తేలికపాటి తలనొప్పి, తల తిరిగినట్లు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. వైద్యులను సంప్రదించాలి.

అయితే, సాధారణ మైకం, వెర్టిగో మద్య స్వల్ప వ్యత్యాసం ఉంది. వెర్టిగో అనేది ఒక రకమైన మైకం. ఈ సమస్య ఉంటే నిలబడి ఉన్నప్పటికీ పరిసరాలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలా తల తిరిగినప్పుడు శరీరం అసమతుల్యత అనిపిస్తుంది. దీని సాధారణ లక్షణాలు తలనొప్పి, వికారం, వాంతులు, వినికిడి లోపం, కదిలేటప్పుడు కనిపించడం, మూర్ఛపోవడం వంటివి ఉన్నాయి. ఒత్తిడి వల్ల కూడా వెర్టిగో సమస్యలు రావచ్చు.

ఒత్తిడి, వెర్టిగో నేరుగా సంబంధం కలిగి ఉండవు కానీ, ఒత్తిడి.. వెర్టిగోకు కారణం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెస్టిబ్యులర్ సిస్టమ్ పనిచేయకపోవడంలో ఒత్తిడి ప్రభావం చూపుతుంది. వెస్టిబ్యులర్ వ్యవస్థకు ఏదైనా నష్టం జరిగితే అది మైకానికి దారి తీస్తుంది. అంటే ఒత్తిడి నేరుగా కాకపోయినా వెర్గిగోను ప్రేరేపిస్తుంది. నిజానికి, వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్‌ను అధిక స్థాయిలో విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ వెస్టిబ్యులర్ సిస్టమ్ నుండి మెదడుకు, నాడీ సమాచార ప్రసారాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిషన్‌కు అంతరాయం కలిగించి, మైకం కలిగించే అవకాశం ఉంది. మరోవైపు, ఒత్తిడి కూడా హిస్టామిన్, న్యూరోస్టెరాయిడ్స్ విడుదలకు కారణమవుతుంది. అవి మైకానికి కారణమయ్యే న్యూరోట్రాన్స్‌మిషన్‌ను కూడా ప్రభావితం చేస్తాయి.

ఒత్తిడి కాస్తా వెర్టిగోకు కారణమైతే.. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మ్యూజిక్ వినొచ్చు. ధ్యానం చేయవచ్చు. యోగాసనాల ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే సమయంలో కెఫిన్ కలిగిన ఆహారాలు, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. భావోద్వేగ స్థితి గురించి కుటుంబం లేదా స్నేహితులతో చెప్పాలి. సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్‌తో మాట్లాడటం ద్వారా కూడా సహాయం పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..