Reheating Of Food: ఈ ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేయడం ప్రమాదకరం.. ఆరోగ్యానికి చాలా డేంజర్..

ఏదైనా ఆహారాన్ని వండిన తర్వాత తినడం ఆలస్యం చేయవద్దు. వేడి వేడిగా తినడం ఉత్తమం.. ఎందుకంటే మీరు ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేయాల్సి వస్తుంది. అది కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.

Reheating Of Food: ఈ ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేయడం ప్రమాదకరం.. ఆరోగ్యానికి చాలా డేంజర్..
Reheating Of Food
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 05, 2022 | 6:18 PM

మనం చాలా సార్లు వండిన పదార్థలను మరోసారి వేడి చేసుకుని వేడి వేడిగా తింటాం. ఇలా తినడం వల్ల వేడి పదార్థలు తిన్నట్లుగా ఫీలింగ్ ఉంటుంది.  ఇళ్లల్లో ఆహారాన్ని తయారుచేసినప్పుడల్లా ఎంత అవసరమో అంతే వడుకుంటాం. కానీ కొన్నిస్లారు కొలతకు మించి వంట చేస్తుంటారు. ఇలా చేసిన సమయంలో వండిన ఆహారం అలాగే మిగిలిపోతుంది.  ఆ మిగిలిన ఆహారంను మళ్లీ వేడి చేస్తాం. ఆహారం వృధా కాకుండా ఇలా వేడి చేసి తిరిగి తినేస్తుంటాం. కానీ ఇలా మళ్లీ వేడి చేసి తినడం ద్వారా మీరు మీ ఆరోగ్యానికి మేలు చేయడం కాకుండా హాని చేస్తున్నారని మాత్రం మరిచిపోకండి. ఒక్కసారి వేడి చేసిన ఆహారం మరోసారి వేడి ఎందుకు చేయవద్దో తెలుసుకుందాం. 

వీటిని మళ్లీ వేడి చేసి తినడం ప్రమాదకరం..

1. పాలకూర..

పాలకూర ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనిని ఉడికించిన తర్వాత మళ్లీ వేడి చేస్తే.. క్యాన్సర్ కలిగించే విషపూరితమైన పదార్థాలు ఇందులో నుంచి వస్తాయి. కాబట్టి అలా చేయకుండా ఉండండి.

2. బంగాళాదుంప వంటకాలు..

బంగాళాదుంప వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో వంటకాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే కొందరు మరింత ఈజీగా పని పూర్తి చేసుకునేందుకు బంగాళాదుంపలను ముందుగా ఉడకబెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల క్లోస్ట్రిడియం బోటులినమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. అందువల్ల బంగాళాదుంపలు ఉడకబెట్టిన వెంటనే ఉపయోగించడం మంచిది.

3. అన్నం వండిన వెంటనే..

మన ఇళ్లలో అన్నం వండిన వెంటనే తనడం మంచిది. ఉదయం చేసిన అన్నంను రాత్రి తింటాం.. ఇలా తినడం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా అన్నం వండిన 2 గంటల్లోపు తినాలని సలహా ఇస్తున్నారు. అలా కాకుండా ఎప్పుడో వండిన వంటను తిరిగి వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. 

4. గుడ్డు..

గుడ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. దాని కారణంగా గుడ్డుకు సూపర్ ఫుడ్ హోదా ఇవ్వబడింది. అయితే ఉడికించిన కొద్దిసేపటికే తినండి మంచిది. ఉడికించిన తర్వాత మరోసారి ఉడికించి తినడం దాని రుచిని మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..