New Technology: నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేయొచ్చు.. కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ ప్రాబ్లమే ఉండదు..!
New Technology: మొబైల్ విషయంలో నెట్‌వర్క్ లేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెట్‌వర్క్ సరిగా లేకపోవడం వలన..
New Technology: మొబైల్ విషయంలో నెట్‌వర్క్ లేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెట్‌వర్క్ సరిగా లేకపోవడం వలన.. కాల్ డ్రాప్స్, కాల్ బ్రేక్స్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో నెట్‌వర్క్ సరిగా లేకపోవడం, కాల్స్ వెళ్లకోపోవడంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు వినియోగదారులు. అయితే, ఇకపై ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పడనుంది. అవును, తాజా సమాచారం ప్రకారం త్వరలోనే నెట్ వర్క్ లేకుండానే కాల్స్ చేయగల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 14 ద్వారా నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేయొచ్చు.
అవును, భవిష్యత్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఆండ్రాయిన్ 14లో నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు టెక్ దిగ్గజాలు. టెక్నాలజీ నివేదికల ప్రకారం.. ఆపిల్ తన ఐఫోన్ 14లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పుడు వినియోగదారులు OS లలోనూ ఈ టెక్నాలజీని పొందే ఛాన్స్ ఉంది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి లాక్‌హైమర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో వినియోగదారులు శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లతో మెరుగైన సేవలు, సరికొత్త అనుభవాన్ని పొందుతారని తెలిపారు. ప్రసుత్తం శాటిలైట్‌కు OS ఫీచర్ రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వర్క్ నడుస్తోందని, ఆండ్రాయిడ్ తదుపరి వెర్షన్‌లో వినియోగదారులు ఈ శాటిలైట్ కనెక్టివిటీని పొందవచ్చన్నారు.
ఆపిల్ లాంచ్‌కు ముందు ప్రకటన.. మరికొద్ది రోజుల్లో ఐఫోన్ 14 విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ శాటిలైట్ కనెక్టివిటీ గురించి వెల్లడించడం ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 7న జరిగే ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 14ను లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ కంటే ముందు, ఆపిల్ ఐఫోన్లలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. అందుకే గూగుల్కూడా ఈ టెక్నాలజీ విషయంలో వెనుకడుగు వేయదలుచుకోలేదనే టాక్ వస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఆపిల్ కంటే ముందుగానే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సైన్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..