Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Great indian Festival: దసరా షాపింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారా.? బంపర్‌ బొనంజా రడీ.. అమెజాన్‌ ఆఫర్లే, ఆఫర్లు..

Amazon Great indian Festival: పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్స్‌ వరుస ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రతీ ఏటా దసరా పండగకు ఫ్లిక్‌ కార్ట్‌, అమెజాన్‌ వరుస ఆఫర్లను ప్రకటిస్తాయనే విషయం తెలిసిందే...

Amazon Great indian Festival: దసరా షాపింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారా.? బంపర్‌ బొనంజా రడీ.. అమెజాన్‌ ఆఫర్లే, ఆఫర్లు..
Amazon Great Indian Festival
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 06, 2022 | 6:05 AM

Amazon Great indian Festival: పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్స్‌ వరుస ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రతీ ఏటా దసరా పండగకు ఫ్లిక్‌ కార్ట్‌, అమెజాన్‌ వరుస ఆఫర్లను ప్రకటిస్తాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌-2022ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పండగకు కొత్తగా టీవీ, స్మార్ట్‌ఫోన్‌, వాషింగ్‌ మెషిన్‌లు ప్లాన్‌ చేస్తున్న వారికి ఈ ఆఫర్‌ కలిసొస్తుందని అమెజాన్‌ చెబుతోంది.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ – 2022 సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గృహోప కరణాలు, ఇతర ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్‌ లభించనున్నట్లు సమాచారం. అయితే సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభంకానుందన్న దానిపై క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం, గృహోపకరాణలపై ఏకంగా 75 శాతం వరకు అలాగే నిత్యావసరాలపై 65 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ను ప్రారంభించిననున్న సెప్టెంబర్‌ 23 నుంచి సేల్‌ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఎస్‌బీఐ కార్డుతో అమెజాన్‌ ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ లభించనుంది. 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..