Top CEOs Earning: టాప్‌ కంపెనీల సీఈవోలకు అత్యధిక వేతనాలు.. 2021-22లో భారీగా పెంపు.. ఎవరికి ఎంత..?

Top CEOs Earning: ఏదైనా టాప్‌ కంపెనీలో ఉద్యగం సంపాదించడం కష్టమైన పనే. వారి వేతనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కంపెనీ తగినట్లుగానే వారి పనితీరు కూడా అలానే ఉండాలి..

Top CEOs Earning: టాప్‌ కంపెనీల సీఈవోలకు అత్యధిక వేతనాలు.. 2021-22లో భారీగా పెంపు.. ఎవరికి ఎంత..?
Top Ceos Earning
Follow us
Subhash Goud

|

Updated on: Sep 05, 2022 | 1:53 PM

Top CEOs Earning: ఏదైనా టాప్‌ కంపెనీలో ఉద్యగం సంపాదించడం కష్టమైన పనే. వారి వేతనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కంపెనీ తగినట్లుగానే వారి పనితీరు కూడా అలానే ఉండాలి. టాప్‌ కంపెనీల్లో పని చేసే సీఈవోలు అత్యధికంగా వేతనాలు అందుకుంటారు. అత్యధికంగా వేతనాలు అందుకునే టాప్‌ కంపెనీలు దేశంలో చాలానే ఉన్నాయి. భారతదేశంలోని టాప్‌ లిస్టెడ్‌ కంపెనీలలోని సీఈవోలు గత ఆర్థిక సవత్సరంలో పెద్ద ఎత్తున జీతాలు అందుకున్నారు. వారి సగటు పరిహారంలో వార్షిక పెరుగుదల 40 శాతం ఉంది. కనీసం ఐదు సంవత్సరాలలో అత్యంత వేగంగా వారి వేతనాలు పెరిగాయి. అయినప్పటికీ వారి చెల్లింపులు కంపెనీ, వారి పనితీరు మధ్య సంబంధం ఉంది. 2021-22లో 30 సెన్సెక్స్‌ కంపెనీల మొత్తం టాప్‌లైన్‌, బాటమ్‌ లైన్‌ రెండూ 20 శాతం, 40 శాతం వరకు కంపెనీ సీఈవోల వేతనాలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15 శాతం క్షీణించిన తర్వాత ఈ కంపెనీల్లోని కీలక నిర్వాహణ సిబ్బంది మొత్తం వేతనం సంవత్సరంలో 16.2 శాతం వరకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. గత మూడేళ్ల కిందటి నుంచి కరోనా మమహ్మారి కారణంగా కంపెనీలలో పలు అంతయారాలు ఏర్పడినా.. ఆ తర్వాత క్రమ క్రమంగా కోలుకున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ పెద్దగా లేని కారణంగా కంపెనీలు మళ్లీ పూర్వ వైభవనానికి వచ్చాయి. అయితే కరోనా కాలంలో అంతరాయాలు ఉన్నప్పటికీ అత్యధికంగా సంపాదిస్తున్న ప్రధాన కార్యనిర్వహణాధికారుల భారీగానే పెరగడం గమనార్హం. ఏడాదికి 10 కోట్ల వరకు క్రమంగా పెరుగుతూ వస్తోంది.

ఎవరికి ఎంత పెరిగిందంటే.. (కోట్లల్లో)

ఇవి కూడా చదవండి

ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్ కు 71.0 కోట్లు, టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీకి 62.7 కోట్లు, లార్సెన్, టూబ్రో సీఈవో సుబ్రహ్మణ్యంకు 61.3 కోట్లు, టాటా కన్సంటెన్సీ సర్వీస్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ గోపినాథం 25.8 కోట్లు, హిందుస్థాన్‌ యూనివర్సల్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ మేహతా 22.1 కోట్లు, టాటా స్టీల్‌ ఎండీ, సీఈవో టీవీ నరేందరన్‌ 19.5 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్‌పర్సన్‌, సీఈవో కేకి మిస్త్రీ 19.0 కోట్లు పెరుగుదల ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి