Aadhaar Toll Free: ఆధార్ కార్డు గురించి ఏవైనా సందేహాలున్నాయా..? ఇదిగో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్..!
Aadhaar Toll Free: ప్రస్తుతం ఆధార్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి అవసరాలకు కూడా ఆధార్ తప్పనిసరి..
Aadhaar Toll Free: ప్రస్తుతం ఆధార్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి అవసరాలకు కూడా ఆధార్ తప్పనిసరి అయిపోతుంది. అయితే చాలా మందిలో ఆధార్‌కు సంబంధించిన ఎన్నో సమస్యలున్నాయి. పేరుతో తప్పుగా ఉండటం, పుట్టిన తేదీ, చిరునామ వంటివి తప్పులు దొర్లుతున్నాయి. అలాంటి సమయంలో ఆధార్ సెంటర్‌కు వెళ్లి సరి చేసుకోవాల్సి ఉంటుంది. కొందరికి వాటిని సరిదిద్దుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి..? ఎలా సరి చేసుకోవాలి? అనే విషయాలు సరిగ్గా తెలియవు. ఇలాంటి వారికి హైదరాబాద్ యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. ఆధార్‌కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలుంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించి పరిష్కరించుకోవచ్చని తెలిపింది. ఏవైనా ప్రశ్నలుంటే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ 1947కు సంప్రదించాలని కోరింది.
టోల్ ప్రీ సమయ వేళలు..
ప్రతి రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ టోల్ ప్రీ నెంబర్‌ను సంప్రదించి ప్రశ్నలకు సమాధానం అందుకోవాలని ట్వీట్‌లో పేర్కొంది. IVRS మోడ్‌లో ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్ 24X7, 365 రోజులు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలకైనా వారు సమాధానం ఇస్తారు. ఇందుకు సలహాలు, సూచనలు పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి