Telangana: ఎన్ని అడ్డంకులు ఎదురైనా ‘తగ్గేదేలే’..చాలా అవమానాలు భరించా.. తెలంగాణ గవర్నర్ తమిళసై ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటుచేసిన..
Telangana: తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేదేలేదని.. తన పని తాను కొనసాగిస్తానని చెప్పారు. తాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యానన్నారు. వరంగల్ పర్యటనలో తనను అవమానించారన్నారు. తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని, రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచినట్లు తమిళ సై పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని.. ప్రోటోకాల్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కుతుందన్నారు. తనకు గౌరవం ఇవ్వకున్నా తనాఉ పని చేస్తూనే ఉంటానని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేసామని చెప్పారు.
రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నట్లు తమిళసై సౌందర్ రాజన్ తెలిపారు. వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ అడిగితే చివరి వరకు సమాధానం చెప్పలేదని.. చివరికి 8 గంటలు కారులో ప్రయాణించి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ఆఫీస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తోందని తమిళసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళ ను అవమంచారన్న చరిత్ర తెలంగాణ చరిత్రలో ఉండకూదనేది తన భావన అని పేర్కొన్నారు. రాజ్ భవన్ కు సీఎం, మంత్రులు దూరంగా ఉండటంపై కూడా గవర్నర్ సీరియస్ అయ్యారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా.. ఎందుకు మీరంతా రాజ్ భవన్ లోకి అడుగుపెట్టడం లేదని అన్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేస్తే రిజక్ట్ చేయడంపై కూడా ఆమె స్పందించారు. కౌశిక్ రెడ్డి రాజకీయ నాయకుడని తాను రిజక్ట్ చేయలేదని, సర్వీస్ కోటా కింద కౌశిక్ రెడ్డి ఫిట్ కారనే ఉద్దేశంతోనే రిజక్ట్ చేసినట్లు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ స్పష్టత ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..