Almond Peels: బాదం తిని తొక్కలను పడేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 06, 2022 | 11:47 AM

Almond Peels: మనం వండకునే కూరగాయల్లో ప్రతీ భాగాన్ని ఉపయోగిస్తుంటాం. ఇప్పడుంటే కొందరు వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు గానీ..

Almond Peels: బాదం తిని తొక్కలను పడేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు..
Almond Peels

Almond Peels: మనం వండకునే కూరగాయల్లో ప్రతీ భాగాన్ని ఉపయోగిస్తుంటాం. ఇప్పడుంటే కొందరు వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు గానీ.. మన అమ్మమ్మల కాలం నాటి వారు అయితే కూరగాయలోని ప్రతీ భాగాన్ని వంట చేసేవారు. ఎందుకంటే.. ప్రతీది ఆరోగ్యానికి మంచిదని, అందలోనూ విలువైన పోషకాలు ఉంటాయని చెబుతారు. ఇదే విషయం బాదం పప్పులకూ వర్తిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది బాదం పప్పులను తొక్క తీసి తింటుంటారు. అయితే, బాదం తొక్కల వలన కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని అనేక రకాలుగా వినియోగించొచ్చని చెబుతున్నారు. బాదం పప్పులో మాదిరిగానే ఈ తొక్కలోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, ఇది మీ జుట్టు, చర్మం, నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. మరి వాటిని ఎలా ఉపయోగించాలి? వాటితో ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. జుట్టు సంరక్షణకై..

బాదం పప్పు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందులో ఉండే ప్రోటీన్స్, పోషకాలు ఆరోగ్యాన్ని అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇక బాదం తొక్కలు మేలు చేస్తాయి. బాదం తొక్కలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టును స్ట్రాంగ్‌గా చేయడానికి గుడ్లు, తేనె, అలోవెరా జెల్‌, బాదం తొక్కలను కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను హెయిర్ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ను 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచి.. ఆ తరువాత మంచి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. ముఖారవిందం..

బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. మన చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది. కొన్ని రకాల చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుంది. బాదం తొక్కలను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేస్తే.. మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది చర్మాని మంచి పోషణనిస్తుంది. అలాగే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

3. దంత సమస్యకు చెక్..

ఆయుర్వేదం ప్రకారం.. దంతాలకు సంబంధించిన సమస్యలకు బాదం తొక్క ఉపయోగకరంగా ఉంటుంది. అనేక రకాల దంత సమస్యలకు బాదం తొక్కలను ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బాదం తొక్కలను వేడి చేసి, వాటిని పొడిగా చేయాలి. ఆ ఫౌడర్‌ను దంతాలకు అప్లై చేయాలి. ఇది దంత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.

4. జుట్టు సమస్యలకు చెక్..

తల, జుట్టులో దురద, పేను సమస్య ఉంటే.. బాదం, బాదం తొక్క ఉపయోగించడం ద్వారా చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆయుర్వదం ప్రకారం.. బాదం తొక్కలను పేస్ట్ చేసి తలకు రాసుకుంటే.. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

5. చర్మ సంబంధిత వ్యాధులకు చెక్..

చాలా మంది చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే అది శరీరం అంతా వ్యాపించి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లయితే.. బాదం పప్పు తొక్కలను పేస్ట్ చేసి అలెర్జీ ఉన్న ప్రదేశంలో రాయాలి. మొటిమలు, కురుపులకు కూడా ఇది వర్తిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu