Telangana: డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు..
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏ రాష్ట్రం అమలుచేయని విధంగా సంక్షేమ పథకాలు..
Telangana: తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏ రాష్ట్రం అమలుచేయని విధంగా సంక్షేమ పథకాలు సీఏం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 46 లక్షల మందికి ఫించన్లు ఇస్తుండగా.. మరో 10 లక్షల మందికి తాజాగా ఆసరా ఫించన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ డివిజన్లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు ఆసరా కార్డులను అందజేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్లపై కూడా హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కొంత ఆలస్యమైనప్పటికి.. అర్హులందరికీ దశలవారీడబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చితీరుతామని చెప్పారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో పక్కనే ఉన్న డబల్ ఇంజన్ సర్కార్ మహారాష్ట్రలో 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారని, కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్ ఘడ్ లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంటుతో పాటు, ఎక్కడ లేని విధంగా ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కల్లబొల్ల మాటలతోనే కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆయన రావు విమర్శించారు. ప్రజల కష్టాలను మాత్రం ఈరెండు జాతీయ పార్టీలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు అని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందన్నారు. సీఏం కేసీఆర్ పరిపాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 సంవత్సరాలలో కూకట్ పల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. వేల మందికి సంక్షేమ పథకాలు అందించి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..