Telangana: కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది.. టీఆర్ ఎస్ పై మండిపడ్డ బండి సంజయ్..
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుమారుడు, కుమార్తెపై వస్తున్న అవినీతి ఆరోపణలతో కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికలో
Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుమారుడు, కుమార్తెపై వస్తున్న అవినీతి ఆరోపణలతో కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందన్నారు. అందుకే కేసీఆర్ బాగా డిప్రెషన్‌లోకి వెళ్లారన్నారు. అవినీతి కేసుల నుంచి దృష్టి మళ్లించేందుకు బహిరంగ సభలు పెడుతున్నారని ఎద్దెవా చేశారు. ఫ్రీ కరెంట్ అని ఊరికే చెప్తున్నారని.. గ్రామాల్లో 6 గంటల కరెంట్ కూడా ఉండటం లేదని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ నాశనమైపోయాయని.. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు మోటర్లకు మీటర్లు గుర్తుకువస్తాయా అని ప్రశ్నించారు. ఇక ఏ పండుగకూ లేని నిబంధనల్ని వినాయక నిమజ్జనానికి పెడుతున్నారని విమర్శించారు బండి సంజయ్. గతంలో ఎన్నడూ లేని రీతిలో వినాయక నిమజ్జనానికి ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకుందన్నారు. ప్రజాస్వామ్య విలువలకు సీఎం కేసీఆర్ తిలోదకాలిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి, నలుగురు చనిపోవడంపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు బండి సంజయ్. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిపరుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్లు, పోస్టింగ్‌లకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు ఉందన్నారు. మంత్రికి నెలనెలా మూటలు అప్పచెబుతున్నారని.. త్వరలోనే డీహెచ్‌ను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేస్తారేమోనని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఉద్దరిస్తున్నామని సీఏం కేసీఆర్, మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాఠశాలల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని.. చాక్‌పీస్, డస్టర్ కొనేందుకు డబ్బుల్లేని దయనీయ పరిస్థితి టిఆర్ ఎస్ ప్రభుత్వం ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..