Food Poisoning: ఎప్పుడైనా ఫుడ్‌ పాయిజనింగ్‌ అయితే ఇలా చేయండి.. మీరు సేఫ్‌ అవుతారు!

ఇంటి ఆహారంకాకుండా హోటల్ లేదా రోడ్డు పక్కన ఫుడ్ స్టాళ్లలలో తీసుకునే ఆహారం వల్ల తరచూ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటివి సంభవిస్తాయి. ఒక్కోసారి తీవ్రత ఎక్కువైతే..

Food Poisoning: ఎప్పుడైనా ఫుడ్‌ పాయిజనింగ్‌ అయితే ఇలా చేయండి.. మీరు సేఫ్‌ అవుతారు!
Food Poisoning Tips
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2022 | 11:15 AM

Home remedies for food poisoning: ఇంటి ఆహారంకాకుండా హోటల్ లేదా రోడ్డు పక్కన ఫుడ్ స్టాళ్లలలో తీసుకునే ఆహారం వల్ల తరచూ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటివి సంభవిస్తాయి. ఒక్కోసారి తీవ్రత ఎక్కువైతే మృతి చెందరడం కూడా జరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది చిట్కాలను పాటిస్తే సరి..

  • ఒక కప్పు వేడి నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించి బాగా కలుపుకోవాలి. ఈ ద్రావనాన్ని తాగితే ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • చిటికెడు చక్కెరలో టీస్పూన్ నిమ్మరసం కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి బయటపడతారు.
  • ఒక గిన్నెలో స్పూన్‌ పెరుగు తీసుకోవాలి. దానికి ఒక స్పూన్‌ మెంతి గింజలను కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నమలకుండా మింగేయాలి. కడుపు నొప్పి, వాంతి సమస్య నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
  • జీర్ణ సమస్యలను వదిలించుకోవడానికి అల్లం, తేనెలను ఉపయోగించవచ్చు. ఒక స్పూన్‌ తేనెలో కొద్దిగా అల్లం రసం కలుపుకోవాలి. ఆ తర్వాత దానిని తాగాలి. కడుపు నొప్పికి ఈ చిట్కా చక్కని ఉపశమనం కలిగిస్తుంది.
  • పాన్ మీద జీలకర్ర వేయించి, గ్రైండ్ చేసుకోవాలి. ఈ వేయించిన జీలకర్ర పొడిని సూప్‌లో కలుపుకుని తింటే కడుపు నొప్పి సమస్య తగ్గుముఖం పడుతుంది.
  • తులసి ఆకుల రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, దానికి కొంచెం తేనె కలుపుకోవాలి. దీనిని తాగినా కడుపు నొప్పి సమస్య క్రమంగా తగ్గుతుంది.
  • అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అరటిపండును పెరుగులో మెత్తగా గుజ్జు చేసి, ఆ తర్వాత తినాలి. ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.