కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండులో ఉండే రెండు రకాల ఫైబర్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పలు రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకో కివీ పండు తిన్నట్లయితే.. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.